తన నటన, అభినయంతో మెప్పించి, అందంతో మైమరిపించిన అతిలోకసుందరి శ్రీదేవి. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. దిగ్గజ ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి తదితర అగ్ర కథానాయకుల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనూ పలు చిత్రాల్లో కనిపించి.. హిట్‌పెయిర్‌గా పేరుతెచ్చుకున్నారు. అయితే ఓ సినిమాలో రజినీకి తల్లిగా ఈమె నటించారంటే నమ్మగలరా? అది 13 ఏళ్ల వయసున్నప్పుడు ఈ పాత్ర చేశారు.

ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ తీసిన 'మూండ్రు ముడిచ్చు' సినిమాలో రజినీ, శ్రీదేవి.. సవతి తల్లి, కుమారుడుగా నటించారు. కథలో భాగంగా దురుద్దేశంతో తన ప్రియుడిని, తనకు కాకుండా చేసినందుకు రజినీపై పగ తీర్చుకునేందుకు అతడి తండ్రిని వివాహం చేసుకొని, సవతిగా మారుతుంది. కానీ దీని తర్వాత చాలా చిత్రాల్లో రజనీ, శ్రీదేవి జోడీగా తెరపై కనువిందు చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: