Twitter Job Posting Feature : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. ఆన్లైన్ ఉద్యోగాల వేదిక లింక్డ్ఇన్కు సవాల్ విసరడానికి సన్నద్ధమైంది. ఇందుకోసం ఓ సరికొత్త ఫీచర్‌ను కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. గుర్తింపు పొందిన సంస్థలు ఇకపై తమ వేదికపై జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేసుకొనేందుకు వీలును కల్పిస్తూ ఈ లేటెస్ట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
Twitter vs LinkedIn : ట్విట్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా 528 మిలియన్ల యూజర్లు ఉన్నారు. అందువల్ల ఎంతో ఆదరణ ఉన్న తమ వేదికలో.. వెరిఫైడ్ సంస్థలు జాబ్ నోటిఫికేషన్లు వెలువరించేందుకు అవకాశం కల్పించే దిశగా ట్విట్టర్ అడుగులు వేస్తోంది. ఈ చర్య మైక్రోసాఫ్ట్ నేతృత్వంలోని లింక్డ్ఇన్కు నేరుగా సవాల్ విసిరినట్టుగా కనిపిస్తోంది.
Start Hiring On Twitter : ట్విట్టర్‌కు చెందిన ఈ నయా ఫీజర్ గురించి నిమా ఓవ్జీ అనే యాప్ రీసెర్చర్ గుర్తించారు. వెంటనే దాని స్క్రీన్ షాట్‌ను ట్వీట్ చేశారు.
-
#Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀
— Nima Owji (@nima_owji) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
"Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h
">#Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀
— Nima Owji (@nima_owji) July 20, 2023
"Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h#Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀
— Nima Owji (@nima_owji) July 20, 2023
"Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h
"ట్విట్టర్ హైరింగ్ అనేది ఒక ఉచిత ఫీచర్. వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్ ఈ నయా ఫీచర్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లను పోస్టు చేయవచ్చు. అదే విధంగా మంచి టాలెంట్ ఉన్న అభ్యర్థులను తమ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవచ్చు."
- నిమా ఓవ్జీ
ట్విట్టర్ తీసుకొచ్చిన ఈ నయా ఫీచర్ ద్వారా.. వెరిఫైడ్ సంస్థలు తమ కంపెనీ ప్రొఫైల్‌లో గరిష్ఠంగా 5 వరకు జాబ్ ఓపెనింగ్స్‌ను పోస్ట్ చేయవచ్చు. అలాగే ఆయా సంస్థలు.. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ లేదా ఎక్స్ఎమ్ఎల్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. దీని ద్వారా కేవలం నిమిషాల్లో కొత్త జాబ్‌లను పోస్టు చేయవచ్చు. వాటిని ట్రాక్ చేయవచ్చు. సాధారణంగా ఎవరైనా యూజర్లు.. సంబంధిత కంపెనీ ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేసినప్పుడు, వారికి ఈ జాబ్ నోటిఫికేషన్లు కనిపిస్తాయి.
ముందే హింట్ ఇచ్చారు!
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్.. తాజా హైరింగ్ ఫీచర్ గురించి మే నెలలోనే ఒక హింట్ ఇచ్చారు. త్వరలో ట్విట్టర్ వేదికగా జాబ్ ఓపెనింగ్స్‌ను పోస్టు చేసుకునే అవకాశం కల్పిస్తామని అప్పుడే చెప్పారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ట్విట్టర్ 2.0 మే నెలలోనే జాబ్ మ్యాచింగ్ టెక్ స్టార్టప్ Laskieని కూడా కొనుగోలు చేసింది.
'ఢీ' కొట్టడానికే..!
LinkedIn vs Twitter : ఎలాన్ మస్క్ .. మైక్రోసాఫ్ట్ నేతృత్వంలోని లింక్డ్ఇన్కు సవాల్ విసిరేందుకే ఈ నయా ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు టెక్ నిపుణుల భావన. ఎలాన్ మస్క్ 'ఎవ్రీథింగ్ యాప్'ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇది చైనాకు సంబంధించిన 'వీచాట్'కు సిమిలర్‌గా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా పేమెంట్స్, మెసేజింగ్, సోషల్ నెట్వర్కింగ్ సహా పలు ఫీచర్లు వీచాట్‌ను పోలి ఉంటాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.