ఆకాశంలో మరో అద్భుతం కనువిందు చేయనుంది. కొత్తగా కనుగొన్న తోకచుక్క.. భూమికి సమీపంగా రానుంది. ఈ "నియోవైజ్" తోకచుక్క.. గత 25ఏళ్లలోనే అత్యంత ప్రకాశవంతమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వారం రోజుల ముందే బుధ గ్రహం కక్ష్య దాటిందని.. మరో రెండు వారాల్లో భూమిని దాటుతుందని పేర్కొన్నారు.
ఈ తోకచుక్క 3మైళ్ల(5 కి.మీ) పొడవు ఉంది. ఇది ఉత్తరాన కనపడనుంది. రాత్రి పూట దీనిని చూడవచ్చు. కాలుష్యం తక్కువుగా ఉన్న ప్రదేశాల్లో బైనాక్యులర్స్ సహాయం లేకుండానే దీనిని చూడవచ్చు.