Starlink satellites: శనివారం తెల్లవారు జామున కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన స్పేస్ఎక్స్ రాకెట్ 52 స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ఇక్కడి తీర ప్రాంత వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ పీఠం నుంచి దూసుకుపోయిన ఫాల్కన్ 9 రాకెటు పసిఫిక్ మీదుగా రెండు దశలతో లక్ష్యం వైపుగా సాగింది.
మొదటి దశలో సముద్రంలోని స్పేస్ ఎక్స్ డ్రోన్ షిప్ మీదకు చేరుకొని, రెండో దశలో ఉపగ్రహాలతో కక్ష్యలోని దూసుకెళ్లినట్లు లాంచ్ కమాండర్ తెలిపారు. స్టార్ లింక్ అనేది ఉపగ్రహ ఆధారిత గ్లోబల్ ఇంటర్నెట్ విధానం. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు దూరంగా ఉన్న ప్రాంతాలను సైతం అనుసంధానం చేసేందుకు స్పేస్ ఎక్స్ మిషన్ గత కొన్నేళ్లుగా దీనిపై పని చేస్తోంది.
ఇదీ చూడండి; satellite internet: మనకీ వచ్చేస్తోంది.. శాటిలైట్ ఇంటర్నెట్..!