ETV Bharat / science-and-technology

మీ స్మార్ట్​ఫోన్​ ఎవరికైనా అమ్ముతున్నారా? ఈ విషయాలు మరిచిపోతే అంతే!

Smartphone Selling Tips : కొత్త ఫోన్​ కొనాలనుకున్నప్పుడు.. పాత ఫోన్​ ఎవరికైనా అమ్మేస్తుంటారు కొందరు. లేదంటే.. ఎక్స్ఛేంజ్ చేస్తుంటారు మరికొందరు. అయితే.. స్మార్ట్‌ఫోన్‌ విక్రయించే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాలని మీకు తెలుసా? లేదంటే భవిష్యత్తులో ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది!

Selling Smartphone Tips
Selling Smartphone Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 11:05 AM IST

Smartphone Selling Tricks in Telugu : స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నిత్యావసరం. అయితే.. మెజారిటీ జనం ఒక స్మార్ట్ ఫోన్​ను రెండు మూడు సంవత్సరాలకు మించి ఉపయోగించడం లేదు. కొత్త ఫీచర్ల కోసమో, సాఫ్ట్ వేర్ అప్డేట్స్ కోసమో, లేక సరదాగానో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్​కు మారిపోతున్నారు. ఆ సమయంలో పాత స్మార్ట్​ఫోన్​ను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తుంటారు. కానీ.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మూల్యం చెల్లిస్తుంటారు! ఇంతకీ.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

బ్యాంకింగ్, యూపీఐ యాప్స్: మీరు ఫోన్‌లోని అన్ని బ్యాంకింగ్ యాప్‌లను డెలిట్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఈ యాప్‌లు మీ మొబైల్ నెంబర్‌కు లింక్ అవుతాయి కాబట్టి.. మీ ఫోన్ కొనుగోలు చేసిన వారికి ఓటీపీ తెలియకపోవచ్చు. కానీ.. యాప్‌లో మిగిలి ఉన్న ఏదైనా డేటా ప్రమాదకరమైనది కావచ్చు. కాబట్టి ఫోన్లోని అన్ని బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లను డెలిట్ చేయండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్​ బ్యాటరీ లైఫ్ పెరగాలా? ఈ 14 సూపర్​ టిప్స్​ పాటిస్తే చాలు!

కాల్ రికార్డ్స్, మెసేజెస్ : మీ మెసేజెస్, కాల్ రికార్డ్స్​ అందులో లేకుండా చూడండి. అనవసరమైనవి అయితే మీరే డెలిట్ చేయండి. కావాలి అనుకుంటే మాత్రం.. మీ కాంటాక్ట్స్​ బ్యాకప్ చేసినట్టుగానే.. వీటిని కూడా బ్యాకప్​ చేసుకోండి. మెయిల్​కు సెండ్​ చేసుకోండి. గూగుల్ డిస్క్‌లో స్టోర్ చేయండి. ఆ తర్వాత మీ కొత్త ఫోన్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

ఎక్స్‌ట్రనల్ డ్రైవ్‌లో బ్యాకప్ : ఫొటోలు, వీడియోలు, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను బ్యాకప్ చేసేందుకు క్లౌడ్ స్టోరేజీ సొల్యూషన్ ఉపయోగించండి. గూగుల్ ఫొటోస్, గూగుల్ డిస్క్, మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్, డ్రాప్‌బాక్స్ వంటి సర్వీసులను ఉపయోగించి క్లౌడ్ బ్యాకప్‌ను ఎంచుకోవచ్చు. క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్ ద్వారా డేటాను రీస్టోర్ చేయడం సులభం అవుతుంది. ఎక్స్​టర్నల్ డ్రైవ్ బ్యాకప్ మెథడ్ డేటాకు అదనపు రక్షణ అందిస్తుంది.

వాట్సాప్ స్టేటస్​ ఇక ఇన్​స్టాలోనూ షేరింగ్- మెటా నయా ఫీచర్

డివైజ్ రీసెట్ చేసే ముందు : మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే మొత్తం డేటా డెలిట్ అవుతుంది. అయితే.. మిమ్మల్ని మీ గూగుల్ అకౌంట్ల నుంచి ఆటోమాటిక్‌గా లాగ్ అవుట్ చేయదని గమనించాలి. ఫ్యాక్టరీ రీసెట్‌ను ప్రారంభించే ముందు అన్ని గూగుల్ అకౌంట్లు, ఇతర ఆన్‌లైన్ అకౌంట్ల నుంచి మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేయడం చాలా అవసరం. మీరు ఫోన్ సెట్టింగ్స్​లో ‘accounts’ కోసం సెర్చ్ చేయడం ద్వారా.. లేదా జీమెయిల్ సెట్టింగ్స్​ ద్వారా ‘accounts’ యాక్సెస్ చేయడం ద్వారా లాగిన్ చేసిన అకౌంట్లను తెలుసుకోవచ్చు.

మైక్రో ఎస్‌డీ కార్డ్‌ : మీరు మైక్రో ఎస్‌డీ కార్డ్‌లను ఉపయోగిస్తుంటే.. వాటిని మీ ఫోన్ నుంచి వెంటనే తొలగించండి. అయితే, తొలగించడానికి ముందు, స్టోర్ చేసిన డేటా సురక్షితంగా ఉందో లేదో చెక్ చేసుకోండి.

జియో e-సిమ్​తో బోట్ స్మార్ట్​వాచ్ - ఇక మొబైల్​తో పనే లేదు! ధర ఎంతంటే?

వాట్సాప్ బ్యాకప్‌ మాన్యువల్‌గా చేయండి : కొత్త ఫోన్‌కి మారడానికి ముందు మీ వాట్సాప్ చాట్‌లను భద్రపరచుకోవాలి. గూగుల్‌లో వాట్సాప్ సెట్టింగ్స్​ ద్వారా చాట్ బ్యాకప్‌ను రూపొందించండి. కావాలనుకున్న ఫైల్స్​ మాత్రమే సెలక్ట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉంది.

ఎన్‌క్రిప్ట్ చేయండి : ఫోన్​లో ఫ్యాక్టరీ రీసెట్‌ స్టార్ట్ చేసే ముందు.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఎన్‌క్రిప్ట్ చేసి ఉందో లేదో వెరిఫై చేయండి. ఎన్​క్రిప్ట్ ఎనేబుల్​ చేసి లేకపోతే.. మీరు ఫోన్ సెట్టింగ్స్​ ద్వారా మాన్యువల్‌గా ఎన్‌క్రిప్షన్‌ ఎనేబుల్ చేయొచ్చు.

బెస్ట్​ ఇయర్​బడ్స్​ కోసం చూస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో టాప్​ బ్రాండ్స్​ మీ కోసం!

ఫైనల్​గా ఇలా : మీ ఫోన్‌లోని అన్ని కీలకమైన ఫైల్స్​ బ్యాకప్‌ తీసుకొని.. ఎన్‌క్రిప్షన్‌ ఎనేబుల్ చేసిన తర్వాత.. ఫ్యాక్టరీ రీసెట్‌ పూర్తి చేయండి. Settings లోకి వెళ్లి Reset ఆప్షన్ ఎంచుకుని అందులో Erase All Data పై క్లిక్​ చేయండి. దాంతో మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మొత్తం డేటా డెలిట్ అవుతుంది.

పాస్​వర్డ్​లో ఎమోజీలు వాడొచ్చా? ఎక్స్​పర్ట్స్ మాటేమిటి?

మీ​ ఫోన్​లో ఈ సీక్రెట్ కోడ్స్​ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.