ఆకాశం నుంచి భూమిని చూస్తే కలిగే అనుభూతే వేరు. విమానాలు, హాట్ఎయిర్ బెలూన్లతో ఓ మోస్తారు ఎత్తు నుంచి చూసే ఉంటారు. అయితే లక్ష అడుగల ఎత్తులో.. శూన్యం నుంచి భూమిని చూడాలని ఉందా? అంతరిక్షపు అంచులను తాకాలనుకుంటున్నారా? ఆ అవకాశాన్ని కల్పిస్తోంది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సంస్థ స్పేస్ పర్స్పెక్టివ్.
స్పేస్‌షిప్ నెప్ట్యూన్‌ను అంతరిక్ష పర్యటనకు సిద్ధం చేస్తోంది స్పేస్ పర్స్పెక్టివ్. హాట్ఎయిర్ బెలూన్ తరహాలో ఉండే ఈ హైటెక్ అంతరిక్ష నౌకలో ఒక పైలట్‌తో పాటు 8 మంది వరకు యాత్రికులు వెళ్లొచ్చు. అందులో బార్‌తో పాటు పరిసరాలను ఆస్వాదించేలా విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: అంతరిక్ష వీధిలో వేసవి సెలవులు గడపొచ్చు!
ఎంత సేపు ప్రయాణం..
ఈ ప్రయాణం మొత్తం 6 గంటలు. భూమికి లక్ష అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు 2 గంటలు.. అక్కడ క్యాబిన్లో 360 డిగ్రీల్లో దృశ్యాలను వీక్షించేందుకు యాత్రికులకు ఓ 2 గంటలు.. తిరుగు పయనంలో సముద్రంలో నౌకపై స్పేస్ షిప్ దిగడానికి మరో 2 రెండు గంటల సమయం పడుతుంది.
2024లో తొలి స్పేస్ షిప్‌ను అంతరిక్ష పర్యటనకు పంపేందుకు స్పేస్ పర్స్పెక్టివ్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే తొలి ఫ్లైట్లను అమెరికాలోని ఫ్లోరిడాలోనే మొదలుపెట్టనున్న సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా లాంచింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని భావిస్తోంది.
ఇదీ చూడండి: అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ల కోసం పోటీ!
టికెట్ ఎంత?
2024లోనే వెళ్లాలంటే ఒక్కరికి దాదాపు రూ.92 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఏడాది కోసం రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ధర తగ్గుతుంది. పైగా రిజర్వేషన్ సొమ్ము రీఫండబుల్.
మానవరహితంగా ఈ నౌకను జూన్ 18న అంతరిక్షంలోని విజయవంతంగా పంపింది ఈ సంస్థ. ఆరున్నర గంటల తర్వాత తిరిగొచ్చిన ఈ నౌక.. అంతరిక్ష పర్యటనలో మరో ముందడుగని స్పేస్ పర్స్పెక్టివ్ తెలిపింది.
ఇదీ చూడండి: tiktoker into space: అంతరిక్షంలోకి.. టిక్‌టాకర్
అంతరిక్ష యాత్రకు ఇవి కూడా..
ప్రపంచంలోనే తొలిసారి అంతరిక్ష పర్యటన చేసింది అమెరికాకు చెందిన ధనవంతుడు డెనిస్ టిటో. 2001 ఏప్రిల్‌లో రష్యాకు చెందిన సోయుజ్ రాకెట్లో ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అప్పటి నుంచి అతి కొద్ది మంది మాత్రమే అంతరిక్ష యాత్ర చేపట్టారు.
ఇక అంతరిక్ష పర్యటనలనే నమ్ముకున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్, రిజర్డ్ బ్రాన్సన్కు చెందిన వర్జిన్ గాలక్టిక్ సంస్థలు ఎట్టకేలకు యాత్ర చేపట్టనున్నాయి.
ఇదీ చూడండి: బెజోస్‌తో అంతరిక్ష ప్రయాణానికి అన్ని కోట్లా!