ETV Bharat / science-and-technology

ఎయిర్​ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్​! ఇక గాలిలో రయ్యిన ఎగిరిపోవచ్చు!

e plane air taxi: రోడ్లపై ట్రాఫిక్​ జామ్​లకు చెక్​ పెట్టేలా ఎయిర్​ ట్యాక్సీలను రూపొందించింది దిల్లీకి చెందిన ఈ-ప్లేన్​ అనే సంస్థ. ఇద్దరు ప్రయాణించేలా.. హెలికాప్టర్​ మాదిరిగా దీన్ని తయారు చేశారు రూపకర్తలు. 2023 నాటికి దీని ట్రయల్​ రన్​ నిర్వహిస్తామని తెలిపారు.

e plane air taxi
ఎయిర్​ ట్యాక్సీ
author img

By

Published : May 29, 2022, 11:55 AM IST

e plane air taxi: ఇప్పటివరకు ఆటోలో, ట్యాక్సీల్లో ప్రయాణం చేసి ఉంటారు. కానీ ఎయిర్​ ట్యాక్సీలో ప్రయాణం చేశారా? త్వరలోనే ఇది నిజం కాబోతుంది. దేశంలోని కొన్ని కంపెనీలు ఎయిర్​ ట్యాక్సీలను తయారు చేస్తున్నాయి. దిల్లీలోని ప్రగతి మైదాన్​లో జరిగిన డ్రోన్​ ఫెస్టివల్​లో ఈ ప్లేన్​ సంస్థ ఎయిర్​ ట్యాక్సీ మోడల్​ను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్​కు వచ్చిన అనేక మంది అధికారులు, వివిధ సంస్థలు ప్రతినిధులు, ప్రజలు ట్యాక్సీని ఆసక్తిగా తిలకించారు.

e plane air taxi
ఎయిర్​ ట్యాక్సీ
e plane air taxi
ప్రదర్శనలో ఎయిర్​ ట్యాక్సీ

ఈ-ప్లేన్​ అనే సంస్థ ఈ-20 పేరుతో ఎయిర్​ ట్యాక్సీ నమూనాను రూపొందించింది. ఇది హెలికాప్టర్​లాగా గాలిలో ఎగురుతుంది. నేలపై ల్యాండ్​ అవుతుంది. దీంట్లో రెండు సీట్లు ఉండగా.. ఒకటి పైలట్​కు, మరొకటి ప్రయాణికుడు కూర్చోవడానికి వీలుగా తయారు చేశారు రూపకర్తలు. దీనికి 12 ప్లాస్టిక్​ పేపర్​ రోటర్​లను అమర్చారు. ఇది 200 కిలోమీటర్ల వరకు గంటకు గరిష్ఠంగా 160 కిమీ వేగంతో ప్రయాణిస్తుందని.. 3000 మీటర్ల ఎత్తు వరకు వెళుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఎయిర్​ ట్యాక్సీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని రూపకర్తలు తెలిపారు. ఎయిర్​ ట్యాక్సీ ఇంటి పైకప్పు నుంచి రాకపోకలను సాగించేలా తయారు చేశామని చెప్పారు.

e plane air tax
ఎయిర్​ ట్యాక్సీ

ఈ-20 ఎయిర్​ ట్యాక్సీ పొడవు 5 మీటర్లు, వెడల్పు 5 మీటర్లు ఉంటుందని.. దీనికన్నా చిన్న మోడల్​ మరొకటి తయారు చేస్తున్నామని వెల్లడించారు ఆ సంస్థ ప్రతినిధులు. ఇది 3 మీటర్ల పొడవు, వెడల్పు ఉంటుందని.. దీనికి పైలట్​ కూడా అవసరం ఉండదన్నారు. దీనికి ఈ-50 అని పేరు పెట్టామని.. ఇంజిన్​ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ విమానం మొదటి ట్రయల్​ 2023 నాటికి జరుగుతుందని చెప్పారు.

ఇదీ చదవండి: ఆమెకు ఒకేసారి 16 గోల్డ్ మెడల్స్.. ప్రభుత్వానికి స్పెషల్ రిక్వెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.