META new microblogging site : ట్విట్టర్‌కు పోటీగా మరో మైక్రో బ్లాగింగ్ సైట్ అందుబాటులోకి తీసుకురావడానికి మెటా సన్నాహాలు చేస్తోంది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఈ జూన్ నెలాఖరు నాటికి దీనిని అందుబాటులోకి తేనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సరికొత్త ప్రాజెక్ట్‌కు బార్సిలోనా అనే కోడ్‌నేమ్ ఇచ్చారు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానం చేయనున్నారు.
500 క్యారెక్టర్స్ బ్లాగ్ :
ముఖ్యంగా ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లో ఒక పోస్టులో 500 వరకు క్యారెక్టర్లను మనం టైప్ చేసుకోవడానికి వీలు కల్పిస్తారని సమాచారం. అంతే కాకుండా యూజర్లు చాలా సులువుగా ఫొటో, వీడియో షేరింగ్ కూడా చేసుకునే వీలు ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా ఈ బ్లాగింగ్ సైట్ ఉండడమే ఇందుకు కారణం.
ట్విట్టర్‌కు పోటీగా :
ప్రస్తుతం ఈ మెటా మైక్రో బ్లాగింగ్ సైట్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఏవైనా బగ్స్ ఉన్నాయామో పరీక్షిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ట్విట్టర్ తన యూజర్లను భారీగా కోల్పోతున్న ఈ సమయంలో దానిని మంచి అవకాశంగా తీసుకుని మెటా తన మైక్రో బ్లాగింగ్ సైట్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ విషయంపై మెటా ఎలాంటి నిర్దిష్ట ప్రకటన చేయలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ట్విట్టర్‌కు పూర్తి స్థాయిలో కొత్త సీఈఓ రాకముందే మెటా తన సరికొత్త మైక్రోబ్లాగింగ్ సైట్ తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ట్విట్టర్‌కు అవుట్సోర్సింగ్ ద్వారా లిండా యకారినో సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పోటీలో మాస్టడాన్ :
మైక్రోబ్లాగింగ్ విషయంలో మరో పోటీదారు మాస్టడాన్. అయితే దీనికి కూడా చెప్పుకోదగిన యూజర్లు ఉన్నారు. అయినప్పటికీ ఆ మాస్టడాన్ ఫ్లాట్‌ఫాంను వినియోగించడం చాలా కష్టంగా ఉంటుందని, ముఖ్యంగా ఆ వేదిక అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదని నిపుణలు అంటున్నారు.
మెటా ప్లాట్‌ఫాంల సీఈఓ మార్క్‌జుకర్‌బర్గ్ గురువారం సాయంత్రం మెటా క్వెస్ట్ 3 నిర్వహించారు. అందులో ఆయన త్వరలోనే నెక్ట్స్ జనరేషన్ వర్చువల్ అండ్ మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను లాంఛ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
కార్యాలయం నుంచే పనిచేయాలి :
మెటా తన ఉద్యోగులకు మరో నిబంధన విధించింది. సెప్టెంబర్ 5 నుంచి కచ్చితంగా వారంలో 3 రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాలని స్పష్టం చేసింది. రిమోట్ వర్కింగ్ పాలసీలో భాగంగా ఇంటి నుంచే పనిచేస్తున్న మెటా ఉద్యోగులకు ఇది చేదు వార్తేనని చెప్పవచ్చు.
ఇవీ చదవండి: