Prepaid Plans With No Daily Data Limit : దేశీయ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు.. తమ యూజర్ల కోసం అన్-లిమిటెడ్ ప్రీపెయిడ్ డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. ప్రతిరోజూ అపరిమిత డేటా ఉపయోగించే యూజర్లకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ప్లాన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జియో రూ.296 ప్లాన్
Jio 296 Plan Benefits : ఈ రూ.296 రిలయన్స్ జియో ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డైలీ లిమిట్ లేని డేటా కావాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ ప్లాన్‌తో 25 GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లను ఉచితంగా వాడుకోవచ్చు. FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) ద్వారా అపరిమిత 5జీ డేటా కూడా వాడుకోవచ్చు.
Jio 296 Plan Benefits : జియో ఇదే తరహా ఆఫర్లతో మరో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఆ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదే రూ.239 ప్లాన్. ఈ జియో ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు రోజువారీగా 1.5 GB డేటా లభిస్తుంది. కానీ, ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5జీ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. జియో అధికారిక వెబ్సైట్ లేదా మైజియో యాప్ చూడండి.
భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ అన్ లిమిటెడ్ ప్లాన్
Airtel Unlimited Data Plans 2023 : రిలయన్స్ జియో మాదిరిగానే ఎయిర్టెల్ కూడా రోజువారి అపరిమిత డేటాతో, 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ తీసుకువచ్చింది. బల్క్ డేటా ప్లాన్ కింద రోజువారీ అపరిమిత డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. అదే విధంగా బండిల్డ్ డేటా బెనిఫిట్స్ కల్పిస్తోంది. అంటే యూజర్లు తమకు నచ్చిన ఏ సమయంలోనైనా వారు కోరుకున్నంత డేటా వినియోగించేలా ఆప్షన్ ఇస్తోంది.
ఎయిర్టెల్ రూ.296 ప్లాన్
Airtel 296 Plan Benefits : ఎయిర్టెల్ రూ.296 ప్లాన్ అనేది రోజువారి పరిమితులు లేని ఎంట్రీ లెవల్ డేటా ప్లాన్. ఈ ప్లాన్ కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
ఎయిర్టెల్ రూ.489 ప్రీపెయిడ్ ప్లాన్
Airtel 489 Plan Benefits : ఎయిర్టెల్ రూ.489 ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, 50 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 300 ఉచిత ఎస్ఎంఎస్లు ఉంటాయి. థ్యాంక్స్ రివార్డ్స్ కింద అపరిమిత 5జీ డేటా సహా, అదనపు ఖర్చులు లేకుండా 3 నెలల అపోలో సభ్యత్వం, హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి.
ఎయిర్టెల్ రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్
Airtel 509 Plan Benefits : ఎయిర్టెల్ రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఒక నెల వ్యాలిడిటీతో.. అపరిమిత వాయిస్ కాల్స్, 60 జీబీ డేటా ఇచ్చే ప్లాన్. ఈ ప్లాన్‌లో కూడా రోజుకు 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. థ్యాంక్స్ రివార్డ్స్ కింద 5జీ డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు.
జనవరి 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ జారీకి నయా రూల్స్- మనకు డబ్బు ఆదా!