ETV Bharat / science-and-technology

అన్ని 5G ఫోన్లలో జియో 5G పనిచేస్తుందా ? - అన్ని ఫోన్లులో జియో 5జీ

5జీ టెక్నాలజీ త్వరలోనే ప్రతి ఇంటా అడుగుపెట్టబోతోంది. టెక్నాలజీ చరిత్రలో పెను సంచలనం తీసుకురాబోతోంది. ఈ క్రమంలోనే జియో తన 5జీ సేవలను దీపావళి నుంచి షురూ చేయనున్నట్లు ప్రకటించింది. మరి జియో 5జీ సేవలు ఇప్పటివరకు ఉన్న అని ఫోన్లలో పనిచేస్తుందా? 5జీ సేవలు అందిస్తామని చెప్పిన జియో.. ఎస్ఏ స్టాండ్ అలోన్ సేవలందిస్తామని ప్రకటించింది. మరి ఎస్ఏ అంటే ఏంటి?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 2, 2022, 2:04 PM IST

Jio 5G Smart Phone : దీపావళి నుంచి దేశంలో ఐదు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తామని ఇటీవల జియో ప్రకటించింది. ఈ క్రమంలో ఎస్​ఏ(స్టాండ్​ అలోన్​) సేవలు అందిస్తాం అని చెప్పింది. దీంతో ఈ స్టాండ్‌ అలోన్ అంటే ఏంటి? ఎన్ఎస్​ఏ(నాన్‌ స్టాండ్‌ అలోన్‌) అంటే ఏమిటి? ఏయే మొబైల్స్‌కి జియో 5జీ సేవలు వస్తాయో ఓ లుక్కేయండి.
యాపిల్‌ మొబైల్స్‌ జియో 5జీ పని చేస్తుందా అంటే.. 12 సిరీస్‌ మొబైల్స్‌ తర్వాత అన్నింటిలోనూ పని చేస్తుంది అని చెప్పేయొచ్చు. అంతకుముందు ఉన్న ఏ మొబైల్‌లోనూ జియో 5జీ సేవలు అందుబాటులో ఉండవు.

  • యాపిల్‌ 13 సిరీస్‌ మొబైల్స్‌లో ఎస్​ఎ 5జీకి సంబంధించినంత వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 12 సిరీస్‌ మొబైల్స్‌లో నేరుగా ఎస్​ఏ 5జీ వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
  • శాంసంగ్‌ మొబైల్స్‌ ఎస్​ఏ 5జీ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే అది అప్‌డేట్‌ రూపంలో వచ్చాకా? లేక అప్‌డేట్‌ రాకపోయినా అనేది తెలియాల్సి ఉంది. కొత్తగా వచ్చిన నథింగ్‌ మొబైల్‌ విషయంలో ఎలాంటి అప్‌డేట్లు లేకుండానే ఎస్​ఏ 5జీ సేవలు వినియోగించుకోవచ్చు.
  • వన్‌ప్లస్‌ నుంచి వచ్చిన తొలి నార్డ్‌, నార్డ్‌ సీఈ మొబైల్స్‌లో N 78 బ్యాండ్‌ను వినియోగిస్తున్నారు. దీంతో వీటిలో జియో 5జీ వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే వన్‌ప్లస్‌ 8, 8 ప్రో మొబైల్స్ స్పెసిఫికేషన్లు చూస్తే.. ఈ మొబైల్‌ 78 బ్యాండ్‌ను సపోర్టు చేస్తుందని, అయితే ఎస్​ఏ, ఎన్​ఎస్ఏ మోడ్‌ 5జీ సపోర్టు ఉంటుందని రాశారు. అయితే ఇది నేరుగానా, లేక అప్‌డేట్‌ ద్వారానా అనేది తెలియాలి.
  • ఒప్పో మొబైల్స్‌లో ఎంట్రీ లెవల్‌లో ఉన్న A53s 5G లాంటివి ఎస్​ఏ, ఎన్​ఎస్ఏ నెట్‌వర్క్‌లను సపోర్టు చేస్తాయి. అయితే K10 5G and A74 మోడల్స్‌ విషయంలో ఏ నెట్‌వర్క్‌లు సపోర్టు చేస్తాయి అనే సమాచారం లేదు. రెనో సిరీస్‌లో అయితే 75జీ మాత్రమే ఎస్ఏ,ఎన్​ఎస్ఏ నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంది.
  • వన్‌ప్లస్‌ 9 సిరీస్‌, 10 సిరీస్‌ మొబైల్స్‌ అన్నీ ఎస్​ఏ, NSAను సపోర్టు చేస్తాయి అని సమాచారం. నార్డ్‌ 2: 5జీ, నార్డ్‌ సీఈ2 5జీ మొబైల్స్‌ మల్టిపుల్‌ 5జీ బ్యాండ్స్‌తో పని చేస్తాయి.
  • షావోమి, రెడ్‌మీ, పోకో నుంచి ఇప్పటివరకు వచ్చిన 5జీ ఫోన్లలో జియో సేవలు అందుబాటులో ఉంటాయట. అయితే దీని కోసం జియో ఓటీఏ అప్‌డేట్‌ ద్వారా మొబైల్స్‌లో మార్పు చేస్తుంది. జియో ఇస్తామంటున్న ఎస్​ఏ బ్యాండ్‌ను సపోర్టు చేసేలా మొబైల్స్‌కు అప్‌డేట్‌ ఇస్తామని షావోమి టీమ్‌ వెల్లడించింది.
  • షావోమి 11 Lite NE 5G నుంచి షావోమి 12 Pro వరకు అన్ని మోడల్స్‌లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. రెడ్‌మీ సంగతి చూస్తే.. K50i 5G, Note 11T 5G మొబైల్స్‌ సపోర్టు చేస్తాయి. పోకోకు చెందిన M4 5G నుంచి X4 Pro 5G వరకు అన్ని మోడల్స్‌లో జియో 5జీ ఎస్​ఏ సేవలు లభిస్తాయి.
  • రియల్‌మీ నుంచి ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్‌ ​ఎస్ఏ బ్యాండ్స్‌, ఎన్​ఎస్ఏ బ్యాండ్స్‌ను సపోర్ట్‌ చేస్తాయని స్పెసిఫికేషన్స్‌లో రాశారు. ఆ లెక్కన రియల్‌ మీ 9i 5G, 9 Pro Plus 5G, 9 Pro 5G, GT సిరీస్‌ మొబైల్స్‌లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే నేరుగా వాడేయొచ్చా లేక.. ఏమైనా ఓటీఏ అప్‌డేట్‌ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. రియల్‌మీ నార్జో 30 5G, రియల్‌మీ X7 5G మొబైల్స్‌ సంగతిపై క్లారిటీ రావాల్సి ఉంది.
  • వివో దగ్గరికొస్తే.. టీ1 ప్రో, వి 25, ఎక్స్‌ 80 సిరీస్‌ మొబైల్స్‌ ఎస్​ఏ, ఎన్​ఎస్ఏ నెట్‌వర్క్‌ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తాయి. అయితే ​ఎస్ఏ బ్యాండ్‌ వాడాలంటే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారానే సాధ్యమవుతుందట. అలాగే Y72 మొబైల్‌కి కూడా దీని కోసం ఓ అప్‌డేట్‌ విడుదల చేస్తారట.

ఏమిటీ SA, NSA?
ఎస్ఏ అంటే పూర్తి స్థాయిలో 5జీ నెట్‌వర్క్‌ కోసం అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌. అంటే బేస్‌ స్టేషన్‌ నుంచి రేడియో యాంటెనా వరకు అన్నీ 5జీ స్పెసిఫకేషన్లతో రూపొందిస్తారు. డేటా, వాయిస్‌ 5జీ రేడియోలతో పని చేస్తాయి. అదే ఎన్​ఎస్​ఏ అంటే 4జీ కోసం రూపొందించిన లేదా 4జీ ఆధారిత 5జీ సర్వీసు అనుకోవచ్చు. 4జీ ఎక్విప్‌మెంట్‌తో 5జీ సేవలను అందిస్తారన్నమాట. ఎస్​ఏ నెట్‌వర్క్‌ విషయంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వేగమూ ఎక్కువగా ఉంటుంది. కానీ, ఎన్​ఎస్​ఏ దగ్గరకు వచ్చేసరికి ఖర్చు తగ్గుతుంది, అలాగే వేగమూ తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాయిస్‌ క్వాలిటీ కాస్త తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. అయితే సాంకేతికత ఉపయోగించి ఎన్​ఏ నెట్‌వర్క్‌కు ఎన్​ఎస్​ఏ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.

ఎప్పుడు వస్తుంది?
5జీ సేవలకు సంబంధించి రిలయన్స్‌ ఇటీవల ముఖ్య వివరాలు వెల్లడించింది. కంపెనీ 45వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ మేరకు ముకేశ్‌ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళి నాటికి దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా ఈ సేవలను విస్తరిస్తామని తెలిపారు. 2023 డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి మండలంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

ఇవీ చదవండి: సరికొత్త ఫీచర్స్​తో నయా స్మార్ట్​ఫోన్స్​, సెప్టెంబర్​లో రిలీజయ్యేవి ఇవే

వాట్సాప్ కాల్స్​కు కొత్త రూల్స్! ఇక ఫ్రీగా మాట్లాడడం కష్టమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.