ETV Bharat / science-and-technology

పీసీకి వైరస్​ సోకిందా? ఎలా తెలుసుకోవాలి?.. ఏం చేయాలి? - కంప్యూటర్ వైరస్​ ఎలా తెలుసుకోవాలి

పీసీ వాడేవారికి వైరస్‌లు కొత్తకాదు. ఎప్పుడో అప్పుడు వీటితో సతమతమవటం తెలియంది కాదు. ఇంతకీ కంప్యూటర్‌ వైరస్‌ అంటే ఏంటి?  ఒక పోగ్రామ్‌. మన ప్రమేయం లేకుండానే పీసీలో ఇన్‌స్టాల్‌ అయ్యి హానికర పనులు చేస్తుంది. మొత్తం పనితీరునే మార్చేస్తుంది. మరి కంప్యూటర్‌కు వైరస్‌ సోకిందని తెలుసుకోవటమెలా? దీన్ని గుర్తించటానికి ఏవైనా లక్షణాలు ఉంటాయా?

computer virus
computer virus
author img

By

Published : Sep 14, 2022, 10:05 AM IST

Computer Virus Prevention Tips : పీసీ వాడేవారి నోట అప్పుడప్పుడు వినే పదం వైరస్​. ఎప్పుటికప్పుడు వీటితో సతమతమవతూనే ఉంటారు. ఈ కంప్యూటర్‌ వైరస్‌ మన ప్రమేయం లేకుండానే పీసీలో ఇన్‌స్టాల్‌ అయ్యి రకారకాల హానికర పనులు చేస్తుంది. ఒక్కోసారి మొత్తం పీసీ పనితీరునే మార్చేస్తుంది. అయితే కంప్యూటర్‌కు వైరస్‌ సోకిందని మనం తెలుసుకోవటమెలా? దీన్ని గుర్తించటానికి ఏవైనా లక్షణాలు ఉంటాయా? ఓ సారి ఈ విషయాలు తెలుసుకుందాం.

కంప్యూటర్‌ వైరస్‌ల బెడద ఈనాటిది కాదు. 50 ఏళ్ల కిందటే మొదలైంది. మొట్టమొదటి కంప్యూటర్‌ వైరస్‌ పేరు క్రీపర్‌ వామ్‌. ఇది 1971లో పుట్టుకొచ్చింది. ఇదేమీ హాని చేయలేదు గానీ బాగా చిరాకు పెట్టింది. అర్పానెట్‌ అంతటా ప్రయాణిస్తూ 'పట్టుకోండి' అనే సందేశం వదిలి పెట్టేది. అలా మొదలైన కంప్యూటర్‌ వైరస్‌ ప్రస్థానం అనంతంగా సాగుతూనే వస్తోంది. ఇవి రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతూనే వస్తున్నాయి. తీవ్ర నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. మనం ఇన్‌స్టాల్‌ చేసుకోకపోయినా పీసీలో చొరబడేదే అయినా ఇందులో మన ప్రమేయం అసలే లేదనుకోవటానికి లేదు. ఈ-మెయిల్‌ లింకును నొక్కినప్పుడో, వైరస్‌లతో కూడిన వెబ్‌సైట్లను చూసినప్పుడో అదును చూసుకొని దాడి చేసేస్తుంది.

ప్రస్తుతం రాన్‌సమ్‌వేర్‌ రకం వైరస్‌లు పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తే గానీ పీసీని తెరవనీయని స్థితికి తీసుకొస్తున్నాయి. వీటి దెబ్బకు ప్రభుత్వ సంస్థలు, ప్రఖ్యాత వ్యాపార సంస్థలు, బ్యాంకులు సైతం చేతులెత్తేస్తున్నాయి. అడిగినంత డబ్బు చెల్లించి తమ పీసీలను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం ప్రతి 14 సెకండ్లకు ఒక వ్యాపారసంస్థ వీటి బారినపడుతున్నట్టు, ఫలితంగా కోట్లాది రూపాయలు ముట్టజెబుతున్నట్టు సైబర్‌ సెక్యూరిటీ సంస్థల సర్వేలు పేర్కొంటున్నాయి. వీటికి వ్యక్తులూ మినహాయింపేమీ కాదు. ఇలాంటి రాన్‌సమ్‌వేర్‌ దాడి జరిగినట్టు గుర్తిస్తే వెంటనే నిపుణుల సలహా తీసుకోవటం తప్పనిసరి. మరి కంప్యూటర్‌కు వైరస్‌ సోకిందని గుర్తించేదెలా? దీన్ని గుర్తించటానికి కొన్ని 'లక్షణాలు' లేకపోలేదు.

మాటిమాటికీ క్రాష్‌ అవటం
వైరస్‌ సోకినప్పుడు కంప్యూటర్‌ విచిత్రంగా ప్రవర్తించటం ఆరంభిస్తుంది. మాటిమాటికీ ఆఫ్‌ కావొచ్చు. దానంతటదే రీస్టార్ట్‌ కావొచ్చు. కొన్నిసార్లు హార్డ్‌ డిస్క్‌లో స్పేస్‌ పూర్తిగా నిండుకోవచ్చు. లేదంటే డేటా గానీ ప్రోగ్రామ్‌లు గానీ అదృశ్యమైపోవచ్చు. ఇవన్నీ వైరస్‌ సోకిందనటానికి ఆనవాళ్లే.

అదే పనిగా పాపప్‌లు
ఏదైనా వెబ్‌సైట్‌ చూస్తున్నప్పుడు మామూలుగా కన్నా పెద్ద మొత్తంలో పాపప్‌లు దర్శనమిస్తుంటే వైరస్‌ సోకిందేమోనని అనుమానించాలి. బ్రౌజర్‌లో, వెబ్‌సైట్లలో యాడ్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నా ఏదో సమస్య ఉన్నట్టే. యాడ్‌వేర్‌ ద్వారా ఇలాంటి వైరస్‌లు వ్యాపిస్తుంటాయి.

ఫైల్స్‌ యాక్సెస్‌ కాకపోవటం
వర్డ్‌ప్యాడ్‌ను తెరుస్తాం. ఏదో టైప్‌ చేయాలని చూస్తాం. కానీ టైప్‌ చేయటానికి అనుమతి లేదనే సందేశం ప్రత్యక్షమైతే? ఇది పీసీకి వైరస్‌ సోకిందటానికి స్పష్టమైన సంకేతం. హానికరమైన ప్రోగ్రామ్‌లు ఇన్‌స్టాల్‌ అయినప్పుడు మన పీసీలోని ఫైళ్లు యాక్సెస్‌ కావు. అనుమతి లేదని నిరాకరిస్తాయి.

వేగం నెమ్మదించటం
మామూలుగా కన్నా పీసీ వేగం నెమ్మదించినా అనుమానించాల్సిందే. వైరస్‌ సోకినప్పుడు కంప్యూటర్‌ చాలా నెమ్మదిగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కంప్యూటర్‌ బగ్స్‌ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. దీంతో పీసీ మీద ఎక్కువ భారం పడుతుంది. చాలా పనులు చేయాల్సి వస్తుంది. దీంతో వేగం గణనీయంగా పడిపోతుంది.

అనుమానిత వైబ్‌సైట్లలోకి మళ్లింపు
బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి అడ్రస్‌ బార్‌లో గూగుల్‌.కామ్‌ అని టైప్‌ చేశారు. కానీ ఎలక్ట్రానిక్‌ వస్తువులను తక్కువ ధరకు అమ్మే వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయ్యిందనుకోండి. ముందు మనకే నమ్మబుద్ధి కాదు. అడ్రస్‌బార్‌లో తప్పుగా టైప్‌ చేశామేమోనని మనల్ని మనమే అనుమానిస్తుంటాం. నిజానికి ఇలా ఒక సైటుకు బదులు ఇంకో సైట్‌ ఓపెన్‌ కావటమనేది వైరస్‌ సోకిందటానికి ఒక సంకేతం. కంప్యూటర్‌లోకి బగ్‌ చొరబడినప్పుడు అవి ఆయా ప్రకటనలు, యూఆర్‌ఎల్‌ వైపు తీసుకెళ్తాయి.

డేటా వాడకం పెరగటం
దాడులు చేయటానికి లేదా డేటాను సంగ్రహించటానికి హ్యాకర్లు ఆన్‌లైన్‌లో భారీ నెట్‌వర్క్‌లను వాడుకుంటూ ఉంటారు. దీంతో డేటా ఎక్కువగా ఖర్చవుతుంటుంది. కాబట్టి హఠాత్తుగా ఇంటర్నెట్‌ వాడకం పెరిగినట్టు గమనిస్తే వైరస్‌ సోకిందని అనుమానించాలి.

ఎక్కువ శబ్దం చేయటం
కంప్యూటర్‌ను వాడకపోయినా కూడా హార్డ్‌వేర్‌ నిరంతరం శబ్దం చేస్తోందా? మామూలు కన్నా ఎక్కువ శబ్దం వస్తోందా? అతిగా, వేగంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తోందా? అయితే వైరస్‌ బారినపడి ఉండొచ్చు. విండోస్‌ అప్‌డేట్‌ అయినప్పుడో, ఏదైనా ఉచితమైన ప్రాసెస్‌ జరుగుతున్నప్పుడో పీసీ లేదా ల్యాప్‌టాప్‌ తెర తిరిగి వెలుగుతుంటుంది. ఇలాంటివేవీ లేకుండానే ఉన్నట్టుండి వెలిగితే వైరస్‌ సోకిందటానికి సంకేతం కావొచ్చు.

మన నుంచే సందేశాలు
ఈమెయిల్‌, సోషల్‌ మీడియా ఖాతాలు.. ఇతర ఆన్‌లైన్‌ సేవల్లో సమస్యలు మొదలైనా వైరస్‌ సోకి ఉండొచ్చు. కొన్నిసార్లు వీటి నుంచి చిత్రమైన సందేశాలు రావొచ్చు. మన ఖాతాల నుంచి మనకే సందేశాలు అందొచ్చు. దీనికి కారణం వైరస్‌ నేరుగా ఈమెయిల్‌, సోషల్‌ మీడియా ఖాతాల్లోకి చొరబడటం. కీలాగర్‌ సాయంతో హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను అపహరించటమూ దీనికి కారణం కావొచ్చు.

తప్పించుకునేదెలా?

  • వైరస్‌లు చాలావరకు ఫిషింగ్‌ ద్వారా వ్యాపిస్తుంటాయి. లాటరీ తగిలిందనో, ఫ్రీ రీచార్జ్‌ చేస్తామనో హ్యాకర్లు ఈమెయిళ్లు, సోషల్‌ మీడియా ఖాతాలకు లింకులను, అటాచ్‌మెంట్లను పంపించి ఆకర్షిస్తుంటారు. వీటిని నొక్కితే వైరస్‌ పీసీలో చొరబడుతుంది. ఇలాంటి లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తెలిసినవారి నుంచి ఇలాంటి లింకులు వచ్చినా వెంటనే నొక్కకుండా చూసుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.
  • చాలావరకు హానికరమైన .ఈఎక్స్‌ఈ ప్రోగ్రామ్స్‌, సాఫ్ట్‌వేర్స్‌ అంతర్జాలం నుంచి వాటంతటవే డౌన్‌లోడ్‌ అవుతుంటాయి. కాబట్టి విశ్వసనీయమైన ప్రోగ్రామ్స్‌, సాఫ్ట్‌వేర్స్‌ను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • బలమైన ఫైర్‌వాల్‌, అప్‌ టు డేట్‌ యాంటీవైరస్‌ ప్రోగ్రామ్‌లు తప్పనిసరి. యూఆర్‌ఎల్‌ బార్‌లో వెబ్‌సైట్‌ పేరుకు ముందు హెచ్‌టీటీపీఎస్‌ (గ్రీన్‌ లాక్‌) ఉందో లేదో కూడా చూసుకోవాలి. గ్రీన్‌ లాక్‌ లేనట్టయితే వైరస్‌ లేదా మాల్వేర్‌ సోకే ప్రమాదముంది.
  • కంప్యూటర్‌ వాడని సమయాల్లో.. నిద్ర పోతున్నప్పుడో, బయటకి వెళ్లినప్పుడో పీసీని స్కాన్‌ చేసేలా యాంటీవైరస్‌ పోగ్రామ్‌లను సెట్‌ చేసుకోవాలి. దీంతో పనికి ఆటంకం కలగకుండానే పీసీని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

ఇవీ చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. పాత మెసేజ్‌ల సెర్చ్‌ ఇక మరింత ఈజీ!

ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై కాల్స్‌లో ఆ ఇబ్బందులు ఉండవ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.