దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం జీమెయిల్ సేవలు (Dmail Down in India) నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు మెయిల్స్ పంపడం, స్వీకరించడంలో అంతరాయం (Gmail Down) ఏర్పడింది.
డౌన్ డిటెక్టర్ పోర్టల్ ప్రకారం.. 73 శాతం మంది వినియోగదారులు వెబ్సైట్లో, 14 శాతం మంది సర్వర్ కనెక్షన్లో, 12 శాతం మంది లాగిన్ అవడంలో సమస్య ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ సమస్యను గూగుల్ (Gmail Down News) పరిష్కరించింది.
గూగుల్ అందిస్తోన్న ఉచిత మెయిల్ సర్వీస్.. 'జీమెయిల్'. జీమెయిల్‌ను యాక్సెస్ చేయడంలో సమస్య (Gmail Outage) ఎదుర్కొన్నట్లు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో పలువురు వినియోగదారులు ఫిర్యాదులు చేశారు.
గతంలో..
ఈ ఏడాది జూన్‌లోనూ గూగుల్ సహా జీమెయిల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గతేడాది డిసెంబర్లో జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్ వంటి గూగుల్ సేవలు నిలిచిపోవడం వల్ల కోట్లాది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.
ఇదీ చూడండి: మళ్లీ నిలిచిపోయిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా సేవలు