ETV Bharat / science-and-technology

చందమామపై నీరు- కీలక ఆధారాలు లభ్యం! - చంద్రయాన్ 2

చంద్రుడి ఉపరితలం మీద నీటి కణాలను (water on moon) గుర్తించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రయాన్​-2 (chandrayaan 2 news) సేకరించిన డేటాతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. కరెంట్​ సైన్స్​ అనే జర్నల్​లో శాస్త్రవేత్తలు ఈ విషయాలను తెలిపారు.

water molecules on moon, చంద్రుడిపై నీరు ఇస్రో
చందమామ మీద నీటి అణువులు
author img

By

Published : Aug 12, 2021, 4:24 PM IST

జాబిల్లి మీద నీరు ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ ఇప్పటికే పలు నివేదికలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయంపై మరింత బలమైన ఆధారాలను సేకరించారు భారత శాస్త్రవేత్తలు. కొన్నేళ్ల క్రితం ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్-2 (chandrayaan 2 news).. ఇందుకు సంబంధించిన డేటాను సేకరించింది. చంద్రుడి ఉపరితలం మీద నీటి అణువులు (water on moon) ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో మాజీ ఛైర్మన్​ ఏఎస్​ కిరణ్​కుమార్ సహా పలువురు శాస్త్రవేత్తలు కరెంట్​ సైన్స్​ అనే జర్నల్​ ద్వారా ​వెల్లడించారు.

చంద్రయాన్​-2లో ఏర్పాటు చేసిన ఇమేజింగ్​ ఇన్​ఫ్రేర్డ్​ స్పెట్రోమీటర్​ (ఐఐఆర్ఎస్​) సాంకేతికతతో ఈ నీటి అణువులను గుర్తించగలిగామని కిరణ్​కుమార్​ పేర్కొన్నారు. చంద్రుడి ఉపరితలంపైన ఉత్తర భాగంలోని 29 నుంచి 62 డిగ్రీల ల్యాటిట్యూడ్​ల మధ్య హైడ్రాక్సైడ్​ (OH), నీటి (H2O) కణాలు ఉన్నట్లు ఐఐఆర్ఎస్​ అందించిన డేటాలో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు. డేటాకు థర్మల్​ కరెక్షన్​ చేపట్టాకే ఈ విషయాన్ని నిర్ధరించామని స్పష్టం చేశారు. అయితే చంద్రయాన్​-2 ఆశించిన ఫలితాలు అందించలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చంద్రుడి ఉపరితలంపై మైదాన ప్రాంతాలతో పోలిస్తే.. ప్లాగియోక్లేస్ ఖనిజం ఎక్కువున్న రాళ్లలో హైడ్రాక్సైడ్​, నీటి కణాల శాతం ఎక్కువ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇస్రో.. చంద్రయాన్​-2ను 2019 జులై 22న (chandrayaan 2 launch date) అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు దీనిని ప్రయోగించారు. అయితే ఉపరితలం మీదకు ల్యాండ్​​ అవ్వాల్సిన విక్రమ్​ ల్యాండర్​.. సెప్టెంబరు 7న జరిగిన 'హార్డ్​ ల్యాండింగ్'​ కారణంగా జాబిల్లిపైకి విజయవంతంగా చేరుకోవడంలో విఫలమైంది.

ఇదీ చదవండి : సెర్చ్ ఇంజిన్లందు గూగుల్​ వేరయా! కానీ ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.