ETV Bharat / science-and-technology

1జీ నుంచి 5జీకి ప్రయాణం.. డేటా వేగం కాకుండా ఇంకా ఏమైనా మారతాయా? - 1జీ నుంచి 5జీ మార్పు

3జీ, 4జీ అనే వాటిని ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ఇప్పుడు 5జీ వచ్చేసింది. వీటికి ముందు మరో రెండు జనరేషన్లు ఉన్నాయి. 3జీ ఉన్నప్పుడు డేటా స్పీడ్ తక్కువగా ఉండేది, 4జీ వేగం పెరిగిందనేది అందరికి తెలుసు. అసలు ఏంటి 1జీ, 2జీ, 3జీ, 4జీ? ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 5జీతో డేటా వేగం కాకుండా ఇంకా ఏం ఉపయోగాలున్నాయి?

Evolution of wireless technologies
Evolution of wireless technologies
author img

By

Published : Oct 1, 2022, 11:36 AM IST

ఒకప్పుడు ఫోన్లో​ మాట్లాడుకునే సదుపాయం మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాదు ఫోన్లో​నే అన్ని పనులు అయిపోతున్నాయి. ఫోన్ మాట్లాడుకోవటం నుంచి బిల్లులు చెల్లించటం, ప్రభుత్వ సేవల పొందటం అన్ని ఫోన్ ద్వారా జరుగుతున్నాయి. పెరిగిన సాంకేతికతో టెలికాం రంగంలో మార్పులు రావటం వల్ల ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం కొనసాగుతోంది. కొన్ని రోజుల్లో వర్చువల్ ప్రపంచం ఆవిష్కృతం కాబోతుంది. దీనికి 5జీ తోడ్పడనుంది. టెలికాం రంగంలో ప్రస్తుతం 4జీ యుగం నడుస్తోంది. దీనికంటే ముందు 1జీ, 2జీ, 3జీ సాంకేతికలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1జీ
ఇది 1980లలో ప్రారంభమైంది. ఇది మొదటి సెల్ ఫోన్ టెక్నాలజీ. ఈ తరం ఫోన్లలో బ్యాటరీ లైఫ్ చాలా తక్కువగా ఉండేది. ఫోన్ కాల్స్ వాయిస్ క్లారిటీ కూడా తక్కువగా ఉండేది. కాల్స్​కు​ సంబంధించి సెక్యూరిటీ కూడా చాలా తక్కువ. కాల్ డ్రాపింగ్ కూడా ఉండేది. ఈ తరంలో ఇంటర్నెట్ స్పీడ్ 2.4కేబీపీఎస్ల నుంచి 14.4 కేబీపీఎస్ వరకు ఉండేది. ఈ తరంలో కేవలం మాట్లాడుకునేందుకే వీటిని ఉపయోగించారు.

2జీ
సెల్ ఫోన్లకు సంబంధించి ప్రధానమైన అప్​గ్రేడ్ ఇది. అప్పటి వరకు ఉన్న అనలాగ్ రేడియో సిగ్నల్స్ స్థానంలో డిజిటల్ రేడియో సిగ్నల్స్ ఈ తరంలో ఉపయోగంలోకి వచ్చాయి. ఇందులో సీడీఎంఏ, జీఎస్ఎం ప్రామాణికతలు ఉండేవి. ఈ తరంలో వాయిస్తో పాటు ఇంటర్నెట్​కు సంబంధించి సేవలు ప్రధానంగా ఉండేవి. 1జీ నుంచి 2జీకి మారటం వల్ల ఎస్ఎమ్ఎస్, కాన్పరెన్స్ కాల్, కాల్ హోల్డ్ తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. 2జీలో డాటా స్పీడ్ 50కేబీపీఎస్ నుంచి 1ఎంబీపీఎస్ వరకు ఉండేది. 2జీ తర్వాతా 2.5జీ, 2.75జీ లాంటివి వచ్చాయి. ఎస్ఎమ్ఎస్, పిక్చర్ మెస్సేజ్, ఎమ్ఎమ్ఎస్ లాంటి వాటి కోసం డాటా సర్వీసులు ఉండేవి.

3జీ
వెబ్ బ్రౌజింగ్, ఈమెయిల్, వీడియో డౌన్ లోడింగ్, ఫోటోల షేరింగ్, ఇతర స్మార్ట్ ఫోన్ సాంకేతికతలు ఈ తరం ద్వారా అందుబాటులోకి వచ్చాయి. 2001లో 3జీ వాణిజ్య అవసరాలకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో డేటా స్పీడ్ మరింత పెరిగింది. అంతేకాకుండా ఫోన్ కాల్స్ సామర్థ్యం పెరిగింది. 3జీ అనేది స్ట్రీమింగ్​కు సపోర్టు చేసేది. 3జీ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని పెంచింది. డేటా స్పీడ్ 2ఎంబీపీఎస్ ఉండేది. 3జీ నుంచి 4జీ మధ్యలో 3.5జీ, 3.75జీ లాంటివి వచ్చాయి. 3జీ మాడమ్ల ద్వారా బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కూడా ఉండేది.

4జీ
హై స్పీడ్, హై క్వాలిటీ , హై కెపాసిటీ వాయిస్, డేటా సేవలను తక్కువ ధరకు అందించేందుకు ఉద్దేశించినదే 4జీ. హెడీ మొబైల్ టీవీ, వీడియో కాన్ఫరెన్సింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, గేమింగ్ సర్వీసెస్ తదితరాలు దీని ద్వారా వచ్చాయి. 4జీ ఎల్టీఈ అనేది ఈ తరంలో అడ్వాన్స్​డ్​ సాంకేతిక. నిరాటంక స్ట్రీమింగ్ 4జీతో సాధ్యమైంది.

5జీ
4జీతో పోల్చితే డేటా స్పీడ్ 10 రెట్లు పెరగనుంది. 5జీ వల్ల జీబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ పొందవచ్చు. దీనివల్ల ల్యాటెన్సీ కూడా భారీగా తగ్గిపోనుంది. 5జీ వల్ల కేవలం డేటా స్పీడ్ పెరగటమే కాకుండా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది 5జీ ద్వారా సాధ్యం కానుంది. ఐఓటీ పరికరాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ ను 5జీ అందిస్తుంది. ప్రతిదీ వర్చువల్ కానుంది. 5జీ వల్ల కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటివి ఉపయోగం భారీగా పెరగనుంది. స్వయం చోధిత వాహనాలు 5జీ వల్ల సాధ్యం కానున్నాయి. డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి సాంకేతికతల వృద్ధిలోకి రానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.