ETV Bharat / international

బస్సుపై బాంబు దాడి- 14 మంది సైనికులు దుర్మరణం - సిరియా వార్తలు

సిరియాలో భారీ పేలుడు (Syria Bomb Blast) సంభవించింది. సైనికులు ప్రయాణిస్తున్న బస్సుకు రెండు బాంబులు అమర్చారు దుండగులు. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో చోట షెల్లింగ్​లో 10 మంది సాధారణ పౌరులు చనిపోయారు.

syria
ఆర్మీ బస్సు​ సమీపంలో భారీ పేలుడు.. 13 మంది మృతి
author img

By

Published : Oct 20, 2021, 11:17 AM IST

Updated : Oct 20, 2021, 4:37 PM IST

సిరియాలో భారీ పేలుడు (Syria Bomb Blast) సంభవించింది. సైనికులు(Syria Bomb Blast) ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా పేలింది. రాజధాని డమాస్కస్​లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు (Syria Bomb Blast) స్థానిక మీడియా వెల్లడించింది.

సైనికుల బస్సుకు ముందే బయటినుంచి రెండు బాంబులు అమర్చారు దుండగులు. పేలుడు సంభవించిన సమయంలో ఆ ప్రాంతం రద్దీగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఈ దాడికి తక్షణమే ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే.. సిరియా అధ్యక్షుడు బషర్​ అసద్​ను గద్దె దించాలని చూస్తున్న తిరుగుబాటుదారులు, జిహాదీ గ్రూప్​లే దీని వెనుక ఉన్నట్లు భావిస్తున్నారు.

మరోచోట 10 మంది పౌరులు..

సిరియాలోనే జరిగిన మరో దుశ్చర్యలో 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఓ ప్రాంతంపై సైనికులు కాల్పులు జరపగా సాధారణ పౌరులు చనిపోయారు. ఇందులో నలుగురు పిల్లలు, ఓ మహిళ ఉన్నారు.

డమాస్కస్​ శివార్లలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలను కొన్నాళ్ల కిందటే.. ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మిత్ర దేశాలు రష్యా, ఇరాన్​ సహకారంతో సిరియాపై అధ్యక్షుడు బషర్​ అసద్​ దాదాపు పూర్తిస్థాయిలో పట్టుసాధించారు. 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలుకాగా.. 3 లక్షల 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 50 లక్షల మంది శరణార్థులుగా తరలివెళ్లారు.

ఇదీ చూడండి : జపాన్​ సముద్రంలోకి ఉత్తర కొరియా క్షిపణి!

Last Updated : Oct 20, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.