ETV Bharat / international

Vivek Ramaswamy Polls : అమెరికాలో వివేక్ రామస్వామి హవా.. రిపబ్లికన్ డిబేట్​లో టాప్.. విరాళాల వెల్లువ - అమెరికా ఎన్నికలు వివేక్ రామస్వామి

Vivek Ramaswamy Polls : అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో ఉన్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి ప్రజాదరణ పెరుగుతోంది. తొలి బహిరంగ చర్చలో ఆయన ప్రదర్శన ఎక్కువ మందిని ఆకట్టుకుంది. దీంతో ఆయనకు విరాళాలు సైతం భారీగా వస్తున్నాయి.

Vivek Ramaswamy Polls
Vivek Ramaswamy Polls
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 1:26 PM IST

Vivek Ramaswamy Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి.. రేసులో దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల మధ్య జరిగిన తొలి బహిరంగ చర్చలో ఆయనే ఫేవరెట్​గా నిలిచారు. చర్చలో వివేక్ రామస్వామి మెరుగైన ప్రదర్శన చేశారని పలు వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ బహిరంగ చర్చ తర్వాత ఆయనకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

Republican Primary Debate : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఎనిమిది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ఆరుగురు బుధవారం జరిగిన డిబేట్​లో పాల్గొన్నారు. ఇందులో వివేక్ రామస్వామితో పాటు మరో భారత సంతతి నేత నిక్కీ హేలీ ఉన్నారు. ఈ చర్చ తర్వాత వివేక్ రామస్వామి పేరు విపరీతంగా మారుమోగిపోతోంది. దీంతో పాటు ఆయనకు అందే విరాళాల మొత్తం కూడా గణనీయంగా పెరిగిందని వార్తా కథనాలు చెబుతున్నాయి.

Vivek Ramaswamy debate
డిబేట్​లో వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ

సర్వేలో టాప్
Vivek Ramaswamy Republican Party : రేసులో ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సౌత్ కరోలీనా గవర్నర్ నిక్కీ హేలీని.. వివేక్ వెనక్కి నెట్టినట్లు సర్వేలో వెల్లడైంది. ఓ సర్వేలో.. చర్చపై 504 మంది అమెరికన్ల అభిప్రాయం కోరగా.. 28 శాతం మంది వివేక్ రామస్వామి మెరుగైన ప్రదర్శన చేశారని చెప్పుకొచ్చారు. డిసాంటిస్ 27 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. పెన్స్​కు 13 శాతం, నిక్కీ హేలీకి 7 శాతం మంది మద్దతు పలికారు.

  • TRUTH.

    1. God is real.
    2. There are two genders.
    3. Human flourishing requires fossil fuels.
    4. Reverse racism is racism.
    5. An open border is no border.
    6. Parents determine the education of their children.
    7. The nuclear family is the greatest form of governance known to… pic.twitter.com/MTjhqquwl4

    — Vivek Ramaswamy (@VivekGRamaswamy) August 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Vivek Ramaswamy Google Search : అటు గూగుల్ శోధనల్లోనూ వివేక్ అగ్రస్థానంలో నిలిచారు. తొలి రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్​లో పాల్గొన్న అభ్యర్థుల్లో.. వివేక్ గురించే ఎక్కువ మంది గూగుల్​లో వెతికారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో నిక్కీ హేలీ ఉన్నట్లు వెల్లడించింది. ట్రంప్ గైర్హాజరులో వివేక్ రామస్వామి.. రిపబ్లికన్ డిబేట్​ను నడిపిస్తున్నారని యాక్సిస్ సంస్థ అభిప్రాయపడింది. ఆయన అందరి దృష్టి ఆకర్షించారని వాల్​స్ట్రీట్ జర్నల్ సంపాదకీయం పేర్కొంది. అయితే, వివేక్ విదేశాంగ విధానంపై విమర్శనాత్మకంగా స్పందించింది. ఆ విధానంతో శ్వేతసౌధంలోకి ఆయన అడుగుపెట్టలేరని వ్యాఖ్యానించింది.
అయితే, బహిరంగ చర్చ తర్వాత వివేక్​కు పెరిగిన జనాదరణ విరాళాల రూపంలో కనిపించింది. చర్చ ముగిసిన గంట వ్యవధిలోనే 4.5 లక్షల డాలర్ల (రూ.3.7కోట్లు) విరాళాలు వచ్చాయని వివేక్ రామస్వామి ప్రచార బృందం వెల్లడించింది.

Vivek Ramaswamy Polls
వివేక్ రామస్వామి

Donald Trump Arrest : ట్రంప్​ మళ్లీ అరెస్ట్​.. 20నిమిషాల పాటు జైలులో.. తొలిసారి 'మగ్​షాట్​' రిలీజ్​

Prigozhin Death US Intelligence : 'ప్రిగోజిన్​ది ఉద్దేశపూర్వక హత్యే.. క్షిపణితో విమానం కూల్చివేత!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.