అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో శనివారం కార్తే-పర్వాన్ గురుద్వారాపై తామే దాడి చేశామని ఇస్లామిక్‌స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్తపై భారత్‌లో భాజపా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే ఈ ఆపరేషన్ నిర్వహించామని పేర్కొంది. దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి.
అనంతరం తాలిబన్ ప్రభుత్వ దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఐఎస్‌కేపీ తన ప్రకటనలో.. తమ పోరాటయోధుడు ఒకరు హిందువుల, సిక్కుల మందిరంలోకి ప్రవేశించి అక్కడ కాపలాదారుడిని చంపేసి, భక్తులపై కాల్పులు జరపడంతో పాటు.. గ్రనేడ్లు విసిరాడని పేర్కొంది. ఇందులో 50 మంది హిందువులు, సిక్కులు మృతి చెందినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: