ETV Bharat / international

'భారత్​లో 75శాతం మంది బీపీ రోగుల్లో ఆ సమస్య!' - హై బీపీ రోగులు

భారత దేశంలోని బీపీ రోగుల్లో 75 శాతం మందికిపైగా వారి రక్తపోటుపై నియంత్రణ లేదని లాన్సెట్​ ఓ నివేదికలో పేర్కొంది. దాదాపు 13 లక్షల బీపీ రోగులపై అధ్యయనం చేయగా.. సగం మందికి కూడా వారి బీపీ నియంత్రణ గురించి అవగాహన లేదని తెలిపింది.

blood pressure
అధిక రక్తపోటు
author img

By

Published : Nov 28, 2022, 4:49 PM IST

భారత దేశంలోని బీపీ రోగులలో నాలుగింట ఒక వంతు కంటే తక్కువ మందిలో వారి రక్తపోటు అదుపులో ఉందని.. లాన్సెట్​ జర్నల్​ నివేదించింది.​ హృదయ సంబంధిత వ్యాధులతో పాటుగా రకరకాల అనారోగ్య సమస్యలకు అధిక రక్తపోటు ఓ ప్రధాన కారణమని తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, బోస్టన్​ యూనివర్శిటీ పరిశోధకులు.. 2001-2020 నుంచి ప్రచురితమైన 51 అధ్యయనాలను పరిశీలించి ఓ నివేదికను తయారుచేశారు. ఈ అధ్యయనం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా బీపీ రోగుల్లో రక్తపోటు నియంత్రణ రేట్లలో మార్పులను కనుగొన్నట్లు లాన్సెట్​​ వెల్లడించింది. ఆ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..

  • 21 పరిశోధనా పత్రాల ఆధారంగా.. పురుషుల కంటే మహిళల్లో తక్కువ రక్తపోటు నియంత్రణ రేటు ఉన్నట్లు కనుగొన్నారు.
  • 6 పరిశోధనా పత్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బీపీ రోగుల్లో వారి నియంత్రణ రేటు తక్కువగా ఉన్నట్లు వెల్లడించాయి.
  • 2001-2020 మధ్య భారతదేశంలో రక్తపోటు నియంత్రణ రేటు 17.5 శాతంగా ఉంది.
  • 2016-2020 మధ్య గణనీయంగా పెరిగి.. 22.5 శాతానికి చేరుకుందని పరిశోధకులు తెలిపారు.
  • మరికొన్ని పరిశోధనా పత్రాలు ఉత్తర భారతదేశంతో​ పోల్చితే.. దక్షిణ, పశ్చిమ భారత్​లో ఉండే బీపీ రోగులే ఎక్కువ రక్తపోటు నియంత్రణ రేట్లు కలిగి ఉన్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ మహిళలతో పోల్చితే.. కొద్ది మంది పురుషుల్లోనే వారి రక్తపోటు అదుపులో ఉన్నట్లు గుర్తించారు.
  • వీటిలో చాలా తక్కువ అధ్యయనాలు మాత్రమే బీపీ రోగుల జీవనశైలిని ప్రభావితం చేసే అంశాల గురించి నివేదించాయి.
  • గతంతో పోల్చితే 2016-2020 మధ్య కాలంలో బీపీ నియంత్రణ రేటు పెరినప్పటికీ.. ప్రాంతాల వారీగా చాలా తేడాలు ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.
  • ఈ అధ్యయనం ద్వారా సాధారణ మానవుడి రక్తపోటు 140/90తో పోల్చితే బీపీ రోగుల్లో రక్తపోటు చాలా అధికంగా ఉందని వెల్లడించారు.
  • దేశం మొత్తం మీద 13 లక్షల మందికి పైగా ఈ అధ్యయనం జరిగింది. వీటిలో 15 రాష్ట్రాల నుంచే 39 అధ్యయనాలు ఉన్నాయి.
  • మొత్తం అధ్యయనం చేసిన వారిలో 46.8 శాతం మందికి మాత్రమే వారి బీపీ గురించి అవగాహన ఉందని వెల్లడైంది.

భారత దేశంలో హై-బీపీ వల్ల అధికంగా మరణాలు నమోదువుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ మరణాలను తగ్గించాలంటే ప్రజల్లో దీనిపై సరైన అహగావన ఉండాలని.. ప్రభుత్వాలే చొరవ తీసుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అవగాహన కల్పించడం ద్వారా హై-బీపీ వల్ల సంభవించే అనేక హృదయ సంబంధిత రోగాలను, మరణాలను తగ్గించవచ్చని చెప్పారు.

ఇవీ చదవండి:

అదే పనిగా TV చూసిన కొడుకు.. తల్లి చేసిన పనికి అందరూ షాక్​!

జిన్​పింగ్​తో తాడోపేడో తేల్చుకునే పనిలో చైనీయులు- బీబీసీ జర్నలిస్ట్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.