ETV Bharat / international

గాజా మారణహోమాన్ని ఆపాలని భారత్​కు ఇరాన్ వినతి- యుద్ధానికి ఇజ్రాయెల్ విరామం!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 1:59 PM IST

Israel Hamas War Iran Requests India : ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఆపేందుకు ప్రయత్నించాలని భారత్​ను ఇరాన్ కోరింది. బాధితులకు సాయం చేసేందుకు ప్రపంచం చేసే ఏ పనికైనా ఇరాన్ మద్దతిస్తుందని తెలిపింది. మరోవైపు, యుద్ధానికి వ్యూహాత్మక విరామం ప్రకటించేందుకు ఇజ్రాయెల్ ముందుకొచ్చింది.

Israel Hamas War Iran Requests India
Israel Hamas War Iran Requests India

Israel Hamas War Iran Requests India : గాజాలో మారణహోమాన్ని ఆపేందుకు భారత్‌.. తన అన్ని సామర్థ్యాలను వినియోగించాలని ఇరాన్‌ అభ్యర్థించింది. పాశ్చాత్యదేశాల సామ్రాజ్యవాద విధానానికీ, సోవియట్‌ ఒత్తిడికి తలొగ్గని తటస్థ వైఖరి గల చరిత్ర.. భారత్‌కు ఉందని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ఫోన్‌లో సంభాషించారు. గాజాలో ఏళ్లుగా అణచివేతను ఎదుర్కొంటున్న ప్రజలపై ఇజ్రాయెల్‌ నరమేధాన్ని అంతం చేసేందుకు భారత్‌ తన సామర్థ్యాలను ఉపయోగించాలని అభ్యర్థించారు.

Iran On Israel Hamas War : యుద్ధవిరమణ, బాధితులకు మానవతాసాయం చేసేందుకు ప్రపంచం చేసే ఏ పనికైనా ఇరాన్‌ మద్దతిస్తుందన్నారు. ఇజ్రాయెల్‌ దురాక్రమణ నుంచి తమను రక్షించుకునేందుకు పాలస్తీనా పోరాట గ్రూపులకు హక్కు ఉందని తెలిపారు. నాజీ జర్మనీకి వ్యతిరేకంగా అప్పట్లో ఐరోపా దేశాలు ఎలా పోరాటం చేశాయో.. పాలస్తీనా స్వాతంత్ర్యం కోసం ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. చిన్నపిల్లలు, మహిళలు, ఆస్పత్రులు, పాఠశాలలు, శరణార్థి శిబిరాలు, మసీదులు, చర్చిలపై జరిగే దాడులను ఖండించాలని కోరారు. భారత్‌, ఇరాన్‌ దౌత్య సంబంధాలకు ప్రతీకగా నిలిచిన చాబహార్‌ పోర్టును ప్రస్తావించిన రైసీ.. ఇరుదేశాల సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

ISRAEL WAR INDIA IRAN
ధ్వంసమైన భవనాలు

యుద్ధానికి విరామం!
Israel War Stop : హమాస్‌ దాడులకు ప్రతీకారంగా గాజాపై నెల రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌.. వ్యూహాత్మకంగా స్వల్ప విరామం ప్రకటించేందుకు అంగీకరించింది. ప్రదేశాల వారీగా స్వల్ప సడలింపులు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. మానవతా సాయాన్ని సులభతరం చేయడానికి, బందీల నిష్క్రమణకు వీలుగా వ్యూహాత్మకంగా స్వల్ప విరామాలను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తెలిపారు.

ISRAEL WAR INDIA IRAN
గాజాలో విధ్వంసం

'యుద్ధం తర్వాత కూడా గాజాను మేమే..'
గాజాపై తమ దేశం చేస్తున్న యుద్ధానికి సాధారణ కాల్పుల విరమణ ఆటంకం కలిగిస్తుందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తెలిపారు. పూర్తి స్థాయి కాల్పుల విరమణను హమాస్‌ అనుకూలంగా మార్చుకొని.. తిరిగి బలపడే ప్రమాదం ఉందని అమెరికా కూడా భావిస్తోంది. అయితే మానవతా కారణాలతో ప్రదేశాలవారీగా దాడులకు స్వల్ప విరామం ప్రకటించే విషయాన్ని పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని చెప్పారు. వ్యూహాత్మక దాడులకు స్వల్ప విరామాలను గంట చొప్పున ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలిపారు. మానవతాసాయం గాజా లోపలికి రావడానికి లేదా తమ దేశ బందీలు, విదేశీ బందీలు గాజాను వీడటానికి వీలుగా పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా గాజాలో సుదీర్ఘకాలం భద్రతను తామే పర్యవేక్షించాల్సి ఉంటుందన్న నెతన్యాహు.. ఇంతకాలం పట్టించుకోకపోవటమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని అంటున్నారు.

ISRAEL WAR INDIA IRAN
గాయపడ్డ బాలుడు

సరిగ్గా నెలరోజుల క్రితం హమాస్‌ జరిపిన మెరుపుదాడిలో 1400మంది ఇజ్రాయెల్‌ ప్రజలు మృతి చెందగా.. 240మందిని బందీలుగా తీసుకెళ్లారు. అప్పటినుంచి గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ పెద్దఎత్తున వైమానిక, భూతల దాడులు చేస్తోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో 4వేల మంది చిన్నారులు సహా పది వేలమందికిపైగా పాలస్తీనా ప్రజలు చనిపోయినట్లు గాజా వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగినా, కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌, హమాస్‌ తిరస్కరిస్తున్నాయి. ముందు బందీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయాలని ఇజ్రాయెల్‌ డిమాండ్‌ చేస్తుండగా.. గాజాపై దాడులు కొనసాగినంతకాలం బందీలను విడిచిపెట్టడం లేదా దాడులు ఆపేది లేదని హమాస్‌ కూడా తెగేసి చెబుతోంది.

ISRAEL WAR INDIA IRAN
ధ్వంసమైన భవనాలు

సొరంగాల్లో నక్కిన ముష్కరులే టార్గెట్!
మరోవైపు, గాజాస్ట్రిప్‌లో భూతలదాడుల్ని ఇజ్రాయెల్‌ విస్తరిస్తోంది. హమాస్‌ మిలిటెంట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఉత్తర గాజాను ఇజ్రాయెల్‌ దళాలు చుట్టుముట్టాయి. మిలిటెంట్లు ఉండే కాంపౌండ్‌ను అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపాయి. భూగర్భ సొరంగాల్లో నక్కిన హమాస్ మిలిటెంట్లపై దాడులకు సిద్ధమైనట్లు ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. అయితే హమాస్‌ కూడా ప్రత్యర్థి సేనలను ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉంది. తాజా పరిణామాలను చూస్తే వీధివీధినా పోరాటం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల భారీగా ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

గాజాను రెండుగా చీల్చిన ఇజ్రాయెల్​- యుద్ధంలో కీలక పరిణామం

శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్​ దాడి- 52 మంది మృతి, ప్రపంచ దేశాల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.