ETV Bharat / international

పాక్​​​ మాజీ అధ్యక్షుడు పర్వేజ్​ ముషారఫ్​ కన్నుమూత.. సంతాపం తెలిపిన షెహబాజ్ షరీఫ్ - పర్వేజ్​ ముషారఫ్​ కన్నుమూత

Former President of Pakistan General Pervez Musharraf  passes away

author img

By

Published : Feb 5, 2023, 11:37 AM IST

Updated : Feb 5, 2023, 4:31 PM IST

11:33 February 05

పాక్​​​ మాజీ అధ్యక్షుడు పర్వేజ్​ ముషారఫ్​ కన్నుమూత.. సంతాపం తెలిపిన షెహబాజ్ షరీఫ్

పాకిస్థాన్​ మాజీ అధ్యక్షుడు​ పర్వేజ్​ ముషారఫ్​(79) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అమిలోడయాసిస్ వ్యాధితో ఇబ్బందిపడుతున్న ముషారఫ్​.. దుబాయ్‌లోని అమెరికన్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

పర్వేజ్​ ముషారఫ్ పార్థివదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం పాకిస్థాన్ తరలించనున్నారు. దుబాయ్‌లోని ఆ దేశ కాన్సులేట్ జనరల్.. ముషారఫ్ బౌతికకాయాన్ని పాకిస్థాన్​కు తరలించేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్​(ఎన్​ఓసీ) జారీ చేశారు. అంతకుముందు ముషారఫ్ పార్థీవదేహాన్ని పాకిస్థాన్​కు తరలించేందుకు అనుమతిని ఇవ్వాలని దుబాయ్‌లోని పాక్ కాన్సులేట్‌లో ముషారఫ్ కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ముషారఫ్ మరణం పట్ల పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని ట్వీట్ చేశారు. మరోవైపు, పర్వేజ్ ముషారఫ్ మృతి పట్ల పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ విచారం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంతాపం వ్యక్తం చేశారు. 'ఒకప్పుడు భారత్​కు శత్రువు. 2002 నుంచి 2007 మధ్య శాంతికి నిజమైన శక్తిగా మారిన వ్యక్తి ముషారఫ్​.' అని ట్వీట్ చేశారు.

దేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న దిల్లీలో జన్మించిన ముషారఫ్‌.. దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఆ దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. అభిశంసనను తప్పించుకొనేందుకు తన పదవికి రాజీనామా చేశారు.

పాక్‌ సైనికదళాల ప్రధానాధికారిగా పనిచేసిన ముషారఫ్‌.. 1999లో నవాజ్‌ షరీఫ్‌ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత పాక్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కార్గిల్‌ యుద్ధానికి ముషారఫ్‌ ప్రధాన కారకుడు. 2016 నుంచి ఆయన దుబాయ్​లోనే ఆశ్రయం పొందుతున్నారు.

Last Updated : Feb 5, 2023, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.