ETV Bharat / international

తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు.. ముగ్గురు మృతి - america firing

Shooting America: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. ఫ్లాయిడ్ కౌంటీలోని కెంటుకీ ప్రాంతంలో ఓ ఇంట్లో తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించారు.

3-police-officers-killed-in-kentucky-by-suspect-with-rifle

author img

By

Published : Jul 2, 2022, 10:57 AM IST

America GunShoot: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ గర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంట్లో తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఫ్లాయిడ్ కౌంటీలోని కెంటుకీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ముగ్గురు పోలీసులు చనిపోయారు. వారితోపాటు ఓ జాగిలం కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒక్కసారిగా అగంతకుడి కాల్పులతో అప్రమత్తమయ్యారు అమెరికా పోలీసులు. వెంటనే బ్యాకప్​ కోసం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించి.. నిందితుడు 49ఏళ్ల లాన్స్ స్టోర్జ్​ను అదుపులోకి తీసుకున్నారు. అగంతకుడు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.

అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. జూన్​15న మెక్సికోలో పోలీసులు, సైనికులు, సాయుధుల మధ్య జరిగిన కాల్పుల్లో పది మంది సాయుధులు మృతిచెందగా ముగ్గురు డిటెక్టివ్​లు సహా నలుగురు గాయపడ్డారు. అంతకుముందు, పశ్చిమ మేరీల్యాండ్​లోని కొలంబియా మెషీన్​ అనే కంపెనీలోకి చొరబడ్డ దుండగుడు.. తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఫిలడెల్ఫియాలోని వారాంతపు మార్కెట్​లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సౌత్​ స్ట్రీట్​లో జనసందోహంపైకి దుండగులు కాల్పులు జరపటం వల్ల భారీ నష్టం జరిగింది.

ఇవీ చదవండి: భారీ భూకంపం..రిక్టర్​ స్కేల్​పై 6.3 తీవ్రత.. ఐదుగురు మృతి

48 ఏళ్ల క్రితం నాటి బిల్​గేట్స్ రెజ్యూమ్​ వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.