ETV Bharat / international

ఏదేమైనా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: బ్రిటన్​ ప్రధాని

Boris Johnson party scandal: తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. 'పార్టీ గేట్' కుంభకోణం ఆ దేశంలో వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని బోరిస్​పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా స్పష్టతనిచ్చారు.

Boris Johnson party scandal
BORIS JOHNSON
author img

By

Published : Jan 27, 2022, 6:56 AM IST

Boris Johnson party scandal: ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్లుగా మారిన బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌.. తన మీద ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా రాజీనామా చేయను గాక చేయనంటూ బుధవారం స్పష్టం చేశారు.

Britain PM Boris Johnson resign:

2020-21 కొవిడ్‌ లాక్‌డౌన్ సమయంలో ప్రధాని నివాసం ఉన్న 10 డౌనింగ్‌ స్ట్రీటు, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలను ఇష్టానుసారం ఉల్లంఘించారంటూ 'పార్టీ గేట్‌' కుంభకోణం పేరిట పాత విషయాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఈ విషయమై తాము విచారణ చేపట్టినట్లు లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీసులు ప్రకటించగా.. ఈ విచారణను ప్రధాని బోరిస్‌ స్వాగతించారు.

"నేను రాజీనామా చేయను. మా ప్రభుత్వం బ్రెగ్జిట్​ను సాకారం చేసింది. ఐరోపాలో అత్యంత వేగంగా టీకాను అందుబాటులోకి తెచ్చింది. పోలీసుల విచారణను మేం స్వాగతిస్తున్నాం. త్వరలో అంతర్గత విచారణ నివేదికను విడుదల చేస్తాం. అప్పటివరకు దేశంలో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటాం."

- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధానమంత్రి

UK PM lockdown parties

కొవిడ్‌ ఆంక్షలు కఠినంగా అమలులో ఉన్న 2020 మే 20న గార్డెన్‌ పార్టీ, జూన్‌ 19న బోరిస్‌ 56వ జన్మదిన వేడుకలు 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ ఆవరణలో జరిగాయి. అప్పటికే కరోనా కట్టడి నిమిత్తం దేశంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అటువంటి సమయంలో జాన్సన్‌ పార్టీలు ఏర్పాటు చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష లేబర్‌ పార్టీనేగాక.. సొంత కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. చివరకు ఆయన 'హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌' సాక్షిగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

UK next Prime Minister

అయినా, బోరిస్​పై విమర్శలు ఆగడం లేదు. ఆయన రాజీనామా చేస్తారని, తదుపరి ప్రధానమంత్రిగా రిషి సునక్ బాధ్యతలు చేపడతారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.