ETV Bharat / international

Kabul News: కాబుల్​లో మహిళల నిరసనను అడ్డుకున్న తాలిబన్లు - తాలిబన్లు

తమ హక్కులను కాలరాయొద్దంటూ కాబుల్‌లో మహిళలు చేపట్టిన నిరసనను(Kabul Women Protest) అడ్డుకున్నారు తాలిబన్లు(Kabul News). వారిని అదుపు చేసేందుకు గాల్లో కాల్పులు జరిపినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది.

kabul
కాబుల్ మహిళలు
author img

By

Published : Oct 1, 2021, 5:14 AM IST

విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తమ హక్కులను కాలరాయొద్దంటూ అఫ్గాన్‌ మహిళలు(Kabul Women Protest) చేపడుతున్న నిరసనలపై తాలిబన్లు(Afghan Taliban) విరుచుకుపడుతున్నారు. తాజాగా కాబుల్‌లో(Kabul News) ప్రదర్శన చేపట్టిన మహిళలపై వారు హింసాత్మక ధోరణి ప్రదర్శించారు. 6- 12 తరగతుల బాలికలనూ బడులకు అనుమతించాలంటూ 'స్పాంటేనియస్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ అఫ్గాన్‌ వుమెన్‌ యాక్టివిస్ట్స్‌' బృందానికి చెందిన పలువురు మహిళలు గురువారం స్థానికంగా ఓ సెకండరీ స్కూల్‌ ముందు నిరసనకు దిగారు.

'మా పెన్నులు విరగ్గొట్టొద్దు. మా పుస్తకాలను కాల్చొద్దు. మా పాఠశాలలను మూసివేయొద్దు'.. ఇలా వివిధ నినాదాలు రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. ఇది గమనించిన తాలిబన్లు వెంటనే వారిని అడ్డుకున్నారు. వెనక్కి నెట్టేసి, బ్యానర్లు లాగేసుకున్నారు. వారిని అదుపుచేసేందుకు గాల్లో కాల్పులు సైతం జరిపినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో వారి దుశ్చర్యలను రికార్డు చేస్తున్న విదేశీ జర్నలిస్టులనూ నిలువరించినట్లు పేర్కొంది.

మహిళలను అడ్డుకున్న తాలిబన్ల బృందానికి నాయకత్వం వహించిన మౌలావి నస్రతుల్లా ఈ విషయమై మాట్లాడుతూ.. నిరసనకారులు తమ ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని వివరించారు. అఫ్గాన్‌లో 6- 12 తరగతులకు కేవలం బాలురను మాత్రమే అనుమతిస్తూ తాలిబన్లు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. మహిళల హక్కుల విషయంలోనూ వారు మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారి దుశ్చర్యలను నిరసిస్తూ.. హెరాత్‌, కాబుల్‌ తదితర చోట్ల గళం విప్పిన మహిళలపై తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు.

ఇదీ చదవండి:China Help Afghanistan: అఫ్గానిస్థాన్​కు చైనా భారీ సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.