ETV Bharat / international

స్వీయ నిర్బంధంలోకి రష్యా అధ్యక్షుడు - వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్.. సెల్ఫ్​ ఐసోలేషన్​లోకి వెళ్లారు. ఈ మేరకు క్రెమ్లిన్​(రష్యా ప్రభుత్వ అధికారిక భవనం) స్పష్టం చేసింది. కొవిడ్ పరీక్షలో పుతిన్​కు నెగెటివ్ వచ్చినట్లు క్రెమ్లిన్​ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్​ తెలిపారు.

Putin
పుతిన్
author img

By

Published : Sep 14, 2021, 4:59 PM IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పుతిన్ దగ్గరి వ్యక్తుల్లో ఒకరికి కొవిడ్ నిర్ధరణ కాగా.. ఆయన ఐసోలేషన్​లోకి వెళ్లినట్లు రష్యా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

" రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. పుతిన్ దగ్గరి వ్యక్తుల్లో ఒకరికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో ఆయన ఐసోలేషన్​లోకి వెళ్లనున్నారు. కొవిడ్ పరీక్షలో పుతిన్​కు నెగెటివ్ వచ్చింది."

-- దిమిత్రి పెస్కోవ్, క్రెమ్లిన్ అధికారిక ప్రతినిధి

అయితే.. పుతిన్​ ఎన్నిరోజులు ఐసోలేషన్​లో ఉంటారన్న విషయంపై మాత్రం పెస్కోవ్ స్పష్టతనివ్వలేదు. పుతిన్ ఇప్పటికే రష్యా వ్యాక్సిన్​ స్పుత్నిక్-వీ రెండు డోసులు తీసుకున్నారు.

రష్యాలో రోజువారీ కొవిడ్ కేసులు 17-18వేల వరకు నమోదవుతున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య 800గా ఉంది. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 71 లక్షలు దాటింది. మొత్తం మరణాల సంఖ్య 194,249 కు చేరింది.

ఇదీ చదవండి: చైనాలో మళ్లీ కరోనా కలకలం- అక్కడ లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.