ETV Bharat / international

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఫ్రీగా ఇవ్వండి: నోబెల్‌ విజేతలు - ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్​ కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అయితే ఈ ఔషధాన్ని ఉచితంగా బాధితులకు అందించాలని 18 మంది నోబెల్​ గ్రహీతలు సహా మొత్తం వంద మంది ప్రముఖులు కోరారు. వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఐరాస సెక్రటరీ జనరల్​, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మీడియా సంస్థలు కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు.

Nobel laureates call on international community to make COVID 19 vaccines free globally
కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వండి: నోబెల్‌ విన్నపం
author img

By

Published : Jun 29, 2020, 12:25 PM IST

మార్చి 11న కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది. కాగా, ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా కోటిమంది దీని బారిన పడ్డారు. ఐదు లక్షలకు పైబడి మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అత్యవసర వస్తువుగా పరిగణించి, ఉచితంగా అందించాలని.. 18 మంది నోబెల్‌ గ్రహీతలతో సహా వంద మంది ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. వీరిలో అంతర్జాతీయ సంస్థలు, మాజీ దేశాధ్యక్షులు, ప్రముఖ రాజకీయ నేతలు, ప్రపంచ ప్రసిద్ధ కళాకారులు ఉన్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏకం కావాల్సిందిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మతాధికారులు, కార్పొరేషన్లు, మీడియా సంస్థలకు వారు పిలుపు నిచ్చారు.

Nobel laureates call on international community to make COVID 19 vaccines free globally
నోబెల్​ గ్రహితలు

"కరోనా మహమ్మారి ప్రతిదేశ ఆరోగ్యరంగంలో ఉన్న బలాలను, బలహీనతలను బహిర్గతం చేసింది. ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందించటంలోని అవరోధాలను, అసమానతలను ఇది తేటతెల్లం చేసింది. ఇక రానున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఎంత విజయవంతం కాగలదనేది.. అది ఎంతమేరకు అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. కరోనా వ్యాక్సిన్‌ ఉత్తత్తికి, ప్రపంచవ్యాప్త ఉచిత సరఫరాకు ముందుకు రావాల్సిందిగా ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, దాతలు, సేవాసంస్థలను కోరుతున్నాం. నిస్సహాయులైన ప్రజలను ఏ విధమైన భేదభావం లేకుండా ఆదుకోవడం.. అన్ని సామాజిక, రాజకీయ, ఆరోగ్య సంస్థలతో సహా మనందరి సామూహిక బాధ్యతగా గుర్తించాలి" అని ఆ విజ్ఞాపనలో పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్‌ స్వీకర్త మొహమ్మద్‌ యూనస్‌ స్థాపించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ఈ ఆలోచనకు మద్దతు తెలుపుతూ నోబెల్‌ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌, రష్యా మాజీ అధ్యక్షుడు మైఖేల్‌ గొర్బచెవ్‌, హాలీవుడ్ నటుడు జార్జి క్లూని, దక్షణాఫ్రికాకు చెందిన మతబోధకుడు ఆర్చ్‌ బిషప్‌ డెస్మండ్‌ టుటు తదితరులు సంతకాలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.