ఏడేళ్ల బాలికను ఓ దుకాణదారుడు అత్యాచారం చేసిన దారుణమైన ఘటన పాకిస్థాన్ లాహోర్లోని నవాబ్ టౌన్ ప్రాంతంలో జరిగింది. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
తినుబండారాలకోసం వెళ్లి...
లలాజర్ కాలనీలోని ఓ దుకాణంలో తినుబండారాలు కొనుక్కుందామని వెళ్లిన ఏడేళ్ల బాలికను అత్యాచారం చేశాడు దుకాణదారుడు. కొద్దిసేపటి తర్వాత తన కూతురును వెతుక్కుంటూ వచ్చిన బాధితురాలి తండ్రికి... ఆ ఏడేళ్ల బాలిక ప్రాణపాయ స్థితిలో కనిపించింది. వెంటనే తనను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు బాధితురాలి తండ్రి. డాక్టర్లు అత్యాచారం జరిగినట్లు స్పష్టం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.