ETV Bharat / international

నేపాల్​లో తొలిసారి బ్రాడ్​గేజ్​ సేవలు.. భారత్​ రైళ్లు గిఫ్ట్​ - Indian Embassy news

నేపాల్​లో మొదటిసారి బ్రాడ్​గేజ్​​ రైలు సేవలు ప్రారంభమైన సందర్భంగా ఆ దేశానికి రెండు రైళ్లు అప్పగించింది భారత రైల్వే. బిహార్​లోని జయ్​నగర్​-నేపాల్​లోని కుర్తాల మధ్య(35 కిలోమీటర్లు) నడిచే ఈ రైళ్ల ద్వారా ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరనుందని భారత రాయబార కార్యాలయం ఆశాభావం వ్యక్తం చేసింది.

India hands over two modern trains to Nepal
దేశంలో తొలిసారి బ్రాడ్​గేజ్​ సేవలు.. నేపాల్​కు అప్పగింత
author img

By

Published : Sep 19, 2020, 11:04 PM IST

నేపాల్​లో తొలిసారిగా బ్రాడ్​గేజ్​ సేవలు ప్రారంభమైన సందర్భంగా ఆ దేశానికి రెండు అత్యాధునిక రైళ్లను అప్పగించనుంది భారత్​. బిహార్​లోని జయ్​నగర్​ - నేపాల్​లోని కుర్తా(ధనుశా జిల్లా)ల మధ్య నడిచే ఈ రైళ్ల సేవలు.. డిసెంబర్​లో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

జయ్​నగర్​-కుర్తా బ్రాడ్​గేజ్​ లైన్​ కోసం.. రెండు ఆధునిక డీజిల్​ ఎలక్ట్రిక్​ మల్టిపుల్​ యూనిట్​(డీఎంయూసీ) రైళ్లను నేపాల్​కు పంపింది కొంకణ్​ రైల్వే. అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ రైళ్లు.. ఏసీ ప్రొపల్షన్​ టెక్నాలజీని కలిగి ఉంటాయి. వీటిని చెన్నైలోని ఇంటిగ్రేటెడ్​ కోచ్​ ఫ్యాక్టరీ రూపొందించింది.

ఇరుదేశాల మధ్య 35 కిలోమీటర్లు ప్రయాణించే ఈ రైళ్ల కార్యకలాపాల ద్వారా ఇరు దేశాల పౌరులకు ప్రయోజనం చేకూరుతుందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

ఇదీ చదవండి: దేశంలోనే తొలి కోస్ట్​ గార్డ్ అకాడమీ ఏర్పాటు చేసేది ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.