ప్రపంచ దేశాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 2 కోట్ల 56 లక్షల 69 వేల 688 మందికి వైరస్ సోకింది. 8 లక్షల 55 వేల మంది కొవిడ్‌కు బలయ్యారు. కోటీ 79 లక్షల 96 వేల మందికి పైగా కోలుకున్నారు.
రష్యాలో కొత్తగా 4,729 కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది.
మయన్మార్‌లో తాజాగా 95 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు నమోదైన ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం.
చైనాలో మరో 10 మందికి వైరస్ సోకింది. దీంతో లక్షణాలు లేకుండా కరోనా సోకిన కేసుల సంఖ్య 30కు చేరింది.
భారత్‌లో అత్యధికంగా కొవిడ్ కేసులు బయటపడుతుండగా.. అమెరికా, బ్రెజిల్, పెరూ, కొలంబియా, మెక్సికో, అర్జెంటీనా దేశాల్లో మహ్మమరి తీవ్రత కొనసాగుతోంది.
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 62,12,174 | 187,742 |
బ్రెజిల్ | 39,10,901 | 121,515 |
భారత్ | 36,87,939 | 65,435 |
రష్యా | 10,00,048 | 17,299 |
పెరూ | 6,52,037 | 28,944 |
దక్షిణాఫ్రికా | 6,27,041 | 14,149 |
కొలంబియా | 6,15,168 | 19,663 |
మెక్సికో | 5,99,560 | 64,414 |
స్పెయిన్ | 4,62,858 | 29,094 |
అర్జెంటీనా | 4,17,735 | 8,660 |
ఇదీ చూడండి: 'కరోనా వేళ అలా చేస్తే విపత్తును ఆహ్వానించినట్లే'