ETV Bharat / international

'మాస్క్ ధరించడం​ తప్పనిసరిపై ఆదేశాలు ఇవ్వలేం' - national mask-wearing mandate.

అమెరికావ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాస్క్​లను ధరించేలా ఆదేశాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని శ్వేతసౌధం మరోసారి తిరస్కరించింది. దీనిపై పూర్తి స్థాయి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని వెల్లడించింది.

White House rejects national strategy on masks
'మాస్క్​లు ధరించటం తప్పనిసరి చేయటంపై ఆదేశాలు ఇవ్వలేం'
author img

By

Published : Jul 6, 2020, 10:20 PM IST

అమెరికాలో మాస్క్​లను ధరించటం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయాలన్న నిర్ణయాన్ని మరోసారి వ్యతిరేకించింది శ్వేతసౌధం.

"కచ్చితంగా మాస్క్​లు ధరించాలన్న దానిపై ఆదేశాలు ఇవ్వలేం. మేము ఆయా స్థానిక గవర్నర్‌లు, మేయర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తాం". - మార్క్ మెడోస్, శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్

కరోనా కట్టడి, మాస్క్​ల వినియోగంపై శ్వేతసౌధం తీసుకునే నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు న్యూజెర్సి డెమోక్రటిక్​ గవర్నర్​ ముర్ఫీ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి వల్ల వైరస్​ మరింత ఉద్ధృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్ కూడా మాస్క్​ల తప్పనిసరిపై ఆదేశం ఇచ్చే నిర్ణయాన్ని తిరస్కరించారు.

ఇదీ చూడండి:ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.