ETV Bharat / international

'కరోనా వైరస్​ మరణాలకు బాధ్యత చైనాదే'

కరోనా వైరస్​ అంశంపై మరోమారు చైనాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది శ్వేతసౌధం. వైరస్​ మరణాలకు చైనాదే పూర్తి బాధ్యత అని చెప్పడానికి అధ్యక్షుడు ట్రంప్​ ఎప్పుడూ చింతించరని పేర్కొంది. అదే సమయంలో ట్రంప్​ చేసిన 'కుంగ్​ ఫ్లూ' ఆరోపణలు జాతి వివక్ష వ్యాఖ్యలు కాదని స్పష్టం చేసింది.

Trump holds China responsible for coronavirus deaths, says WH
'కరోనా వైరస్​ మరణాలకు బాధ్యత చైనాదే'
author img

By

Published : Jun 23, 2020, 8:16 AM IST

కరోనా వైరస్ మరణాలకు​ చైనాదే పూర్తి బాధ్యత అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆయన ప్రతినిధి, శ్వేతసౌధం ప్రెస్​ సెక్రటరీ కైలీ మెక్‌నానీ ఒక ప్రకటన విడుదల చేశారు.

"కరోనా వైరస్​పై బాధ్యత చైనాదేనని చెప్పడానికి అధ్యక్షుడు ఎప్పుడు చింతించరు. ఇదే క్రమంలో.. వైరస్​ పుట్టుకకు అమెరికా దళాలే కారణమని చైనా చేస్తున్న అసత్య ఆరోపణలను ట్రంప్​ ఖండించారు. సైన్యానికి ట్రంప్​ అండగా నిలిచారు."

-- కైలీ మెక్​నానీ, అధ్యక్షుడి ప్రతినిధి.

గతవారం జరిగిన ర్యాలీలో వైరస్​ను 'కుంగ్​ ఫ్లూ'గా అభివర్ణించారు ట్రంప్​. అది జాతి వివక్ష వ్యాఖ్య అంటూ ట్రంప్​ విమర్శలు ఎదుర్కొన్నారు. కైలీ దీనిపై స్పందించారు. అధ్యక్షుడు ఎప్పుడు జాతి వివక్షను ప్రోత్సహించరని, చైనాలో పుట్టుకొచ్చిన వైరస్​ గురించే ఆ విధంగా మాట్లాడారని స్పష్టం చేశారు. కుంగ్​ ఫ్లూ అనేది ఆసియా-అమెరికన్లను ఉద్దేశించింది కాదన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కరోనా కేసులు, మరణాలు ఒక్క అమెరికాలో నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 23,88,153 కేసులు వెలుగుచూశాయి. 1,22,610మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.