ETV Bharat / international

పాస్​పోర్ట్ లేకున్నా ఓసీఐ కార్డ్​ హోల్డర్లకు ఎంట్రీ! - ఓసీఐ కార్డు హోల్టర్లు న్యూస్

ఓసీఐ కార్డ్ హోల్డర్లు తమ పాత పాస్​పోర్ట్ లేకుండానే భారత ప్రయాణాలు చేపట్టవచ్చని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కొత్త పాస్​పోర్ట్ మాత్రం తప్పక తీసుకురావాలని పేర్కొంది. 20 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఓసీఐ కార్డులు పొందేందుకు గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు తెలిపింది.

OCI card holders no longer required to carry old passports for India travel
పాత పాస్​పోర్ట్ లేకున్నా ఓసీఐ కార్డ్​ హోల్టర్లకు ఎంట్రీ!
author img

By

Published : Mar 30, 2021, 10:17 AM IST

ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) కార్డులు ఉన్న భారత సంతతి ప్రజలు, ప్రవాసులు ఇక నుంచి తమ పాత, గడువు తీరిన పాస్​పోర్ట్​లను భారత ప్రయాణాల కోసం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఓసీఐ కార్డులతో పాత, కొత్త పాస్​పోర్ట్​లు రెండింటినీ తీసుకెళ్లాలనే నిబంధనను పక్కనపెడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను ప్రస్తావించింది.

అయితే, ప్రయాణ సమయంలో కొత్త(ప్రస్తుత) పాస్​పోర్ట్​ను మాత్రం తప్పక తీసుకురావాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. 20 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఓసీఐ కార్డులు పొందేందుకు గడువును 2021 డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు తెలిపింది.

ఇదివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. భారత్​కు రావాలనుకునే ప్రవాసులు తమ ఓసీఐ కార్డుతో పాటు పాత, కొత్త పాస్​పోర్ట్​లను తప్పక తీసుకురావాల్సి ఉండేది. పాత పాస్​పోర్ట్​లను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ నిబంధన అనేక మంది ప్రవాసులకు అసౌకర్యం కలిగించింది. మరోవైపు, 20 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు కొత్త పాస్​పోర్ట్ తీసుకున్న ప్రతిసారి ఓసీఐ కార్డును మళ్లీ పొందాలని ఇదివరకటి నిబంధనలు చెబుతున్నాయి. అయితే, కరోనా కారణంగా గతేడాది ఈ నిబంధనను భారత్ సడలించింది.

ఇదీ చదవండి: ఓసీఐ కార్డుదారులకు కేంద్రం కొత్త రూల్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.