అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 17 ఏళ్ల ఉద్యమకారిణి గ్రెటా థన్‌బెర్గ్ మధ్య మళ్లీ ట్వీట్ల రగడ మొదలైంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తేలక గందరగోళంలో ఉన్న ట్రంప్‌పై.. తనదైన రీతిలో పంచ్‌లు వేసింది ఈ స్వీడన్ అమ్మాయి. గతంలో తనను విమర్శించినందుకు ప్రతిగా కౌంటర్ వేసి.. వార్తల్లో నిలిచింది.
అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్.. 'లెక్కింపు ఆపండి' అంటూ గురువారం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన థన్‌బెర్గ్ గురువారం ఆయన ట్వీట్‌తోనే వ్యంగ్యంగా సమాధానమిచ్చింది.
-
So ridiculous. Donald must work on his Anger Management problem, then go to a good old fashioned movie with a friend! Chill Donald, Chill! https://t.co/4RNVBqRYBA
— Greta Thunberg (@GretaThunberg) November 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">So ridiculous. Donald must work on his Anger Management problem, then go to a good old fashioned movie with a friend! Chill Donald, Chill! https://t.co/4RNVBqRYBA
— Greta Thunberg (@GretaThunberg) November 5, 2020So ridiculous. Donald must work on his Anger Management problem, then go to a good old fashioned movie with a friend! Chill Donald, Chill! https://t.co/4RNVBqRYBA
— Greta Thunberg (@GretaThunberg) November 5, 2020
"ఇది హాస్యాస్పదం. ట్రంప్ తన కోపాన్ని నియంత్రించుకోవడంపై దృష్టిపెట్టాలి. వీలైతే తన స్నేహితుడితో కలిసి ఓ పాత సినిమాకు వెళ్లాలి! చిల్ డొనాల్డ్, చిల్!".
- ట్విట్టర్లో గ్రెటా థన్‌బెర్గ్
ఆనాటి మాటకు ఇలా...
గతంలో థన్బెర్గ్పైనా డొనాల్డ్ ఇదే తరహాలో విమర్శలు చేశారు. ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్... 'పర్సన్ ఆప్ ద ఇయర్ 2019'గా గ్రెటా థెన్‌బెర్గ్ ఫొటోను మ్యాగజైన్ కవర్ పేజీపై ఉంచినట్లు ప్రకటించింది. ఆ సమయంలో అందరూ ప్రశంసిస్తుంటే ట్రంప్ మాత్రం వెటకారంగా మాట్లాడారు. ఆ సమయంలో ట్రంప్ ఓ ట్వీట్ చేయగా.. అప్పుడే చిన్నపాటి కౌంటర్ కూడా ఇచ్చింది థన్‌బర్గ్. ఆయన చెప్పినట్లే వ్యంగ్యంగా తన ట్విట్టర్ బయోను మార్చింది. తాజాగా అమెరికా ఎన్నికల ఫలితాలపై ఆగ్రహంతో ఉన్న డొనాల్డ్‌కు.. ఆనాడు తనకు ఇచ్చిన సలహానే సూచిస్తూ రివర్స్ పంచ్ ఇచ్చింది థన్‌బెర్గ్.
వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల పాలకులు నూతన విధానాలు రూపొందించాలని 'గ్లోబల్ యూత్ మూమెంట్' పేరుతో ఏడాది కాలంగా పోరాటం చేస్తోంది ఈ స్వీడన్ బాలిక థన్‌బెర్గ్.
ఇదీ చూడండి: