ETV Bharat / international

లండన్​లో కరోనా విలయం... 15 మందిలో ఒకరికి పాజిటివ్​ - కరోనా కేసులు

Corona cases: అమెరికాలో కరోనా వైరస్​ కరాళ నృత్యం చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 4.43 లక్షల కేసులు వెలుగు చూశాయి. మరోవైపు.. ఫ్రాన్స్​లో 2.32 లక్షలు, బ్రిటన్​లో 1.89 లక్షల మందికి వైరస్ సోకింది. ఇంగ్లాండ్​లో 25 మందిలో ఒకరికి, లండన్​లో 15 మందిలో ఒకరికి కరోనా ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడైంది.

World wide corona cases
కరోనా వైరస్​
author img

By

Published : Jan 1, 2022, 9:23 AM IST

Updated : Jan 1, 2022, 2:54 PM IST

Corona cases: ప్రపంచ దేశాలపై కొవిడ్​ మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభణతో కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 4,43,677 మందికి వైరస్​ సోకింది. 716 మంది ప్రాణాలు కోల్పోయారు.

క్రిస్మస్​, నూతన సంవత్సరం నేపథ్యంలో కేసులు మరింత పెరగనున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే.. ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పడకలు దొరకక రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు అగ్రరాజ్యంలో కనిపిస్తున్నాయి. కోటికిపైగా యాక్టివ్​ కేసులు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

15 మందిలో ఒకరికి వైరస్..

బ్రిటన్​లోనూ కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ఇంగ్లాండ్​లో ప్రైవేటు గృహాల్లో నివసించే ప్రతి 25 మందిలో ఒకరికి కొవిడ్ సోకిందని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. మొత్తం 20 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారని తెలిపింది. కరోనా వ్యాప్తి స్థాయి లెక్కింపు ప్రారంభించిన 2020 మార్చి నుంచి ఇదే అత్యధికమని పేర్కొంది. లండన్​లో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా ఉందని అంచనాకు వచ్చినట్లు తెలిపింది.

వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉన్న దేశాలు..

  • ఫ్రాన్స్​లో కొవిడ్​ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టాకు తోడు ఒమిక్రాన్​ కేసులతో కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 2.32 లక్షల మందికి వైరస్​ సోకింది. 189 మంది మృతి చెందారు. 53వేల మంది వైరస్​ను జయించారు.
  • బ్రిటన్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగతోంది. శుక్రవారం ఒక్కరోజే 1.89లక్షల కేసులు వెలుగుచూశాయి. 203 మంది ప్రాణాలు కోల్పోయారు. 43వేల మంది వైరస్​ను జయించారు. మొత్తం కేసుల సంఖ్య కోటీ 29 లక్షలు దాటించింది.
  • ఇటలీలో శుక్రవారం కొత్తగా 1.44లక్షల మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 155 మంది ప్రాణాలు కోల్పోగా, 22వేల మంది వైరస్​ను జయించారు.
  • అర్జెంటీనాలో కొత్తగా 47,663, కెనడా-41,217, గ్రీస్​-40,560, టర్కీ-40,786 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:- 'ఒమిక్రాన్​తో కరోనా కేసుల సునామీ'

Last Updated : Jan 1, 2022, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.