భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ(Modi Us Visit 2021) సందర్భంగా.. ఉగ్రవాదంలో పాకిస్థాన్ పాత్రను ప్రస్తావించారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(kamala harris news). ఉగ్రవాద ముఠాలకు(terrorism news) ఇస్లామాబాద్ మద్దతు, సాయంపై నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ భేటీలో చర్చించిన అంశాలను వెల్లడించారు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా.
" ఉగ్రవాదం అంశం చర్చకు వచ్చినప్పుడు.. పాకిస్థాన్ పాత్రను సుమోటోగా లేవనెత్తారు కమలా హారిస్. పాక్‌లో ఉగ్రవాద ముఠాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ముష్కర మూకలు అమెరికా, భారత్ భద్రతకు ముప్పుగా మారకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు సూచించారు. సరిహద్దు ఉగ్రవాదం, దశాబ్దాలుగా భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందన్న మోదీ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయాలని, ముష్కరులకు పాక్ మద్దతును పర్యవేక్షించాల్సిన ఉవసరం ఉందన్నారు. అలాగే.. కొవిడ్-19, పర్యావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్షం సహా కీలక రంగాల్లో సాంకేతిక భాగస్వామ్యంపై చర్చించారు. "
- హర్షవర్ధన్ ష్రింగ్లా, విదేశాంగ శాఖ కార్యదర్శి.
ఇండో పసిఫిక్‌లో శాంతిపై పునరుద్ఘాటన..
మోదీ, కమలా హారిస్ భేటీలో(PM Modi in US).. అఫ్గానిస్థాన్ సహా తాజా అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు ష్రింగ్లా. ఇండో పసిఫిక్ ప్రాంతంలో(indo pacific news) శాంతి, స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారని తెలిపారు. కొవిడ్ మహమ్మారి రెండో దశ నుంచి భారత్ వేగంగా కోలుకుందని కమలా హారస్ చెప్పినట్లు వెల్లడించారు ష్రింగ్లా.
ఇరు దేశాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీ, అత్యవరమైన ఔషధాల, ఆరోగ్య పరికరాల సరఫరా వంటి విషయాలపై మోదీ, హారిస్ చర్చించారు. పర్యావరణ మార్పులపై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇందులో భాగంగా భారత్ తీసుకుంటున్న చర్యలను హారిస్‌కు వివరించారు మోదీ. పునరుత్పాదక ఇంధనానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, జాతీయ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: Modi Us Visit 2021: 'కమలా హారిస్ ఎంతో మందికి స్ఫూర్తి'