పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం పవన్ మొదటి పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్‌సింగ్'లో నటిస్తున్నారు. మరోవైపు, పవన్ కొత్త ప్రాజెక్టు సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఇటీవలే దానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అని ఉన్న ఆ పోస్టర్ మూవీపై అంచనాలను పెంచుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా ప్రొడక్షన్ సంస్థ డీవీవీ ఎంటర్టైనమెంట్స్.. పవన్ కల్యాణ్ సినిమాలో పనిచేసే అరుదైన అవకాశాన్ని కల్పించింది. ఆర్ట్, ఫ్యాషన్, ఎన్విరాన్మెంట్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్ విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. ఆ పోస్టర్లో ఓ పెన్‌పై జపనీస్ భాషలో ఏవో అక్షరాలు రాసి ఉన్నాయి. ఆ పోస్టర్ కింద #OG#firestormiscoming అని జత చేసింది. ఆసక్తి కలవారు team@theycallhimog.comకి తమ సీవీలను మేయిల్ చేయవచ్చని తెలిపింది. కాగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సినిమటోగ్రఫర్గా రవి చంద్రన్ వ్యవహరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత డీవీవీ బ్యానర్లో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
వీరమల్లు షూటింగ్ శరవేగంగా..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా 'హరి హర వీరమల్లు' వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు.