ETV Bharat / entertainment

'ప్రకృతి' లవ్​ను కన్ఫార్మ్​ చేసిన స్టార్ హీరో.. ప్రేమతో మనసు నిండిపోయిందంటూ.. - ప్రకృతి

ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. తాజాగా వీరిద్ద‌రి ల‌వ్ స్టోరీపై బాలీవుడ్ హీరో వ‌రుణ్‌ధావ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయన ఏమ‌న్నారంటే?

varun-dhawan-confirmed-prabhas-kriti-sanon-relationship

author img

By

Published : Nov 28, 2022, 9:57 AM IST

Updated : Nov 28, 2022, 10:16 AM IST

Prabhas Kriti Sanon Love: పాన్​ ఇండియా స్టార్​ ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆదిపురుష్ సినిమాలో వీరిద్ద‌రు జంట‌గా న‌టించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్‌ మ‌ధ్య ప్రేమ చిగురించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో కృతిస‌న‌న్ పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. అవ‌కాశం వ‌స్తే ప్ర‌భాస్‌ను పెళ్లి చేసుకుంటానంటూ కృతిస‌న‌న్ చెప్పిన పాత ఇంట‌ర్య్వూ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

తాజాగా ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్ ప్రేమాయ‌ణంపై బాలీవుడ్ హీరో వ‌రుణ్‌ధావ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌రుణ్‌ధావ‌న్‌, కృతిస‌న‌న్ క‌లిసి న‌టించిన భేడియా సినిమా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా వీరిద్దరూ ఝ‌ల‌క్‌ ధిక్లా జా డ్యాన్స్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు.

ఇందులో కృతిస‌న‌న్ పేరును మ‌రొక‌రి హృద‌యం త‌ల‌చుకుంటోంది, ఆయన మ‌న‌సు మొత్తం కృతి ప్రేమతో నిండిపోయిందని వ‌రుణ్‌ధావ‌న్ అన్నారు. ఎవ‌రి హృద‌యం అంటూ మ‌రో గెస్ట్‌ క‌ర‌ణ్ జోహార్.. వ‌రుణ్‌ధావ‌న్ మాట‌ల‌ను పొడిగించారు. క‌ర‌ణ్ ప్ర‌శ్న‌కు.. 'ఆ వ్య‌క్తి ప్ర‌స్తుతం ముంబాయిలో లేరు. మ‌రో చోట దీపికతో షూటింగ్‌లో ఉన్నారంటూ వరుణ్ ధావ‌న్‌ పేర్కొన్నారు. ఆ హీరో పేరు మాత్రం వెల్ల‌డించ‌లేదు.

వ‌రుణ్ ధావ‌న్ మాట‌ల‌కు కృతిస‌న‌న్ చిరున‌వ్వులు చిందించింది. ప్ర‌స్తుతం దీపికతో క‌లిసి ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ చేస్తున్నారు. ప్ర‌భాస్‌ను ఉద్దేశించే వ‌రుణ్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు నెటిజ‌న్లు చెబుతున్నారు. వ‌రుణ్ ధావ‌న్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ప్ర‌భాస్ కృతిస‌న‌న్ ప్రేమ‌లో ఉన్న‌ది నిజ‌మేన‌ని అంటున్నారు. అంతే కాకుండా ప్రభాస్​, కృతి సనన్​ పేర్లను కలిపి 'ప్రకృతి' అంటూ ట్రెండ్​ చేస్తున్నారు.

ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్ జంట‌గా న‌టించిన ఆదిపురుష్ జూన్ 16న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రామాయ‌ణ‌గాథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను తొలుత సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయాల‌ని భావించారు. టీజ‌ర్ రిలీజ్ త‌ర్వాత వీఎఫ్ఎక్స్‌పై విమ‌ర్శ‌లు రావ‌డంతో రిలీజ్ డేట్‌ను వాయిదావేశారు. మ‌రోవైపు ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ కే, ప్ర‌శాంత్ నీల్‌ స‌లార్‌తో పాటు ద‌ర్శ‌కురు మారుతితో మ‌రో చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.

Last Updated : Nov 28, 2022, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.