ETV Bharat / entertainment

పక్కా రూట్‌ మ్యాప్‌తో 'హనుమాన్​' తేజ కెరీర్‌ ప్లాన్‌.. ప్రూఫ్‌ ఇదే!

author img

By

Published : Nov 25, 2022, 12:01 PM IST

సినీ ఇండస్ట్రీలో కొందరు యాక్టర్లు మాత్రమే తమ కెరీర్​ను కాస్త భిన్నంగా ప్లాన్​ చేసుకుని అభిమానులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారిలో ముందు ఉంటారు యువ హీరో తేజ సజ్జ. ఆయన తాజాగా నటించిన హనుమాన్ సినిమా టీజర్​ విశేష ఆదరణ పొందింది. తేజ కెరీర్‌ ప్లాన్ కోసం పక్కా రూట్ మ్యాప్‌ ఎలా క్రియేట్ చేసుకున్నాడో చెప్పేందుకు ఈ ఒక్క టీజర్‌తో క్లారిటీ వచ్చేస్తుందంటున్నారు విశ్లేషకులు.

tollywood young hero teja sajja perfect route map for his career

Young Hero Teja Sajja: సాధారణంగా యువ హీరోలు రొటీన్‌ ఫార్ములాతో కెరీర్‌ను మొదలుపెడుతుంటారు. ఇలా కెరీర్‌ షురూ చేసిన వారిలో సక్సెస్‌ అయిన వాళ్లు కొందరు, సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నవారు మరికొందరు. కానీ కొందరు యాక్టర్లు మాత్రం కెరీర్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుని.. ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారి జాబితాలో ముందువరుసలో ఉంటాడు యువ నటుడు తేజ సజ్జ.

తేజ సజ్జ చైల్డ్‌ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్‌ సినిమాల్లో నటించి.. ప్రస్తుతం హీరోగా తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్నారు. తేజ సజ్జ చేస్తున్న సినిమాలు గమనిస్తే.. ఆయన తన కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టు అర్థమవుతోంది. మొదట సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు తేజ సజ్జ. ఈ సినిమాలో తేజ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత హీరోగా తొలిసారి ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో ప్రయోగాత్మక సినిమా 'జాంబిరెడ్డి'లో నటించారు. ఈ మూవీ డిఫరెంట్ కథాంశంలో తెరకెక్కడంతో చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోలో హీరోగా తేజ సజ్జకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు రెండోసారి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో హనుమాన్ సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ పాన్​ఇండియా ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విజువల్స్‌తో సాగుతోంది.

హనుమాన్​ టీజర్​
తేజ సజ్జ కెరీర్‌ ప్లాన్ కోసం పక్కా రూట్ మ్యాప్‌ ఎలా క్రియేట్ చేసుకున్నాడో చెప్పేందుకు ఈ ఒక్క టీజర్‌తో క్లారిటీ వచ్చేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.