ETV Bharat / entertainment

పవన్​ స్టామినా అంటే ఇది.. ఒక్క పోస్ట్​ లేదు.. గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్! - పవన్​ కల్యాణ్​ ఓజీ మూవీ

Pawan Kalyan Instagram : అటు సినిమాలతో ఇటు రాజకీయాలను బ్యాలెన్స్​ చేస్తూ దూసుకెళ్తున్నారు పవర్ స్టార్​ పవన్​ కల్యాణ్​. ప్రస్తుతం చేతి నిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇన్​స్ట్రాగ్రామ్​లో ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్​ సృష్టిస్తున్నారు. ఆయన అకౌంత్​ క్రియేట్​ చేసిన గంటలోనే ఆయనకు ఎంత మంది ఫాలోవర్స్​ వచ్చారంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 4, 2023, 12:47 PM IST

Updated : Jul 4, 2023, 4:55 PM IST

టాలీవుడ్​ పవర్ స్టార్​ పవన్ కల్యాణ్​కు తెలుగునాట ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అటు సినిమాలను ఇటు రాజకీయాలను బ్యాలెన్స్​ చేసే ఆయనకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. సినిమాల్లో తనదైన స్టైల్​లో నటించి మెప్పించిన ఈ స్టార్​ హీరో.. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే విధంగా జోరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇన్నేళ్లు ఆయన కేవలం మీడియాలోనో లేకుంటే ట్విట్టర్​లోనో తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఫ్యాన్స్​లో ఉత్తేజాన్ని నింపుతూ ఉండేవారు. తాజాగా మరో సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ అయిన ఇన్​స్టాగ్రామ్​లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు.

Pawan Kalyan Instagram : ఇప్పటికే ఆయన ఇన్​స్టాలో రానున్నారని గత కొంత కాలంగా నెట్టింట కొన్ని వార్తలు హల్​ చల్​ చేశాయి. వాటిని నిజం చేసిన పవన్ కల్యాణ్​ మంగళవారం ఇన్​స్టా అకౌంట్​ క్రియేట్​ చేసుకున్నారు. అది కూడా వెరిఫైడ్​ అకౌంట్​. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..Jai Hind! అని తన అకౌంట్ డిస్​క్రిప్షన్​లో ఆయన అప్​డేట్​ చేశారు. అయితే ఇంకా ఆయన ఎటువంచి పోస్ట్​ చేయలేదు. మరోవైపు పవన్ అభిమానులు నెట్టింట తెగ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్​ మీడియాలో హ్యాష్​ట్యాగ్​లను ట్రెండ్ చేస్తున్నారు. అయితే క్రియేట్​ చేసుకున్న గంటన్నర లోపే సుమారు నాలుగు లక్షల మందికి పైగా నెటిజన్లు ఆయన్ను ఫాలో అయ్యారు. ఇప్పుడు ఏకంగా 1 మిలియన్​ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

pawan kalyan
పవన్ కల్యాణ్​

Pawan Kalyan Movies : ఇక రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్..​ తన వరస ప్రాజెక్టులను కంప్లీట్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'బ్రో', 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్​ భగత్​ సింగ్' 'ఓజీ' లాంటి సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి థియేటర్లలో రిలీజ్​ చేసే ప్లాన్స్​లో ఉన్నారు. ఇటీవలే రిలీజైన 'బ్రో' టీజర్​​ కూడా ఆద్యంతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అందులో పవన్​- సాయిధరమ్​ యాక్టింగ్​ సూపర్​గా ఉందని అభిప్రాయపడ్డ ఫ్యాన్స్​.. ఈ మామా అల్లుళ్ల కాంబో అదుర్స్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా రిలీజ్​ కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jul 4, 2023, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.