ETV Bharat / entertainment

దిల్​రాజు 'వారసుడు'ను పరిచయం చేసిన దళపతి విజయ్​ - నిర్మాత దిల్​రాజు వారసుడు సినిమా

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్​.. ప్రముఖ నిర్మాత దిల్​రాజు తనయుడిని బయట ప్రపంచానికి పరిచయం చేశారు! ఆ చిన్నోడిని చేతిలో తీసుకుని ముద్దాడారు. అతడితో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

Thalapathy Vijay with producer Dilraju son
దిల్​రాజు 'వారసుడు'ను పరిచయం చేసిన దళపతి విజయ్​
author img

By

Published : Nov 1, 2022, 4:46 PM IST

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'వారిసు'. తెలుగులో 'వారసుడుగా' రాబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్​లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

అయితే ఈ షూటింగ్​ గ్యాప్​లో విజయ్​.. ఈ చిత్ర నిర్మాత దిల్​రాజ్​కు ఇటీవలే పుట్టిన కుమారుడిని ఎత్తుకుని సరదాగా గడిపాడు. అతడిని చేతుల్లోకి తీసుకుని ముద్దాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. ఈ ఫొటో చూసిన వారంతా దిల్​రాజు వారసుడిని విజయ్​ పరిచయం చేశాడంటూ విపరీతంగా కామెంట్స్​ పెడుతున్నారు. సినిమా టైటిల్​కు తగ్గట్టు.. దిల్​రాజు​ తన వారసుడిని విజయ్​ చేతుల మీదగా ప్రపంచానికి పరిచయం చేసేలా భలే ప్లాన్ వేశాడని నెటిజన్లు అంటున్నారు.

కాగా, దిల్​రాజు విషయానికొస్తే.. మొదటి భార్య చనిపోవడంతో ఇటీవలే రెండో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇటీవలే ఓ బాబు జన్మించాడు. అయితే ఆ బాబు ఫొటోను మీడియా కంట పడకుండా దిల్​రాజు జాగ్రత్త పడ్డారు. తాజాగా ఇప్పుడు విజయ్​తో తన వారసుడిని పరిచయం చేయించారు.

Thalapathy Vijay with producer Dilraju son
దిల్​రాజు 'వారసుడు'ను పరిచయం చేసిన దళపతి విజయ్​

ఇదీ చూడండి: అల్లుఅర్జున్​ సీక్రెట్స్​ను అతడికే చెప్తారట.. భార్యకు కూడా నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.