ETV Bharat / entertainment

మహేశ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ కాంబో.. ట్రైలర్‌ అదరహో! - ప్రభాస్​

సూపర్​స్టార్​ మహేశ్​, రెబల్​ స్టార్​ ప్రభాస్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ముగ్గురు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఫ్యాన్స్​కు పండగే. ఈ ముగ్గురు హీరోలు కనువిందు చేసే ఓ ట్రైలర్​ యూట్యూబ్​ను షేక్​ చేస్తోంది. అసలేంటీ విషయం.. ఆ వీడియోలో ఏముంది..? ఆలస్యమెందుకు.. మీరూ చూసేయండి!

tarak mahesh prabhas
tarak mahesh prabhas
author img

By

Published : Jun 19, 2022, 10:46 PM IST

టాలీవుడ్‌ టాప్‌ హీరోలు మహేశ్‌బాబు , ప్రభాస్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? పైగా అల్లు అర్జున్‌ అతిథి పాత్ర చేస్తే ఎంత బాగుంటుంది? ఈ ఆసక్తికర కాంబినేషన్‌లో సినిమా భవిష్యత్తులో రావొచ్చేమోగానీ ప్రస్తుతానికి ఆ అవకాశం లేదు. ఆ లోటును తీర్చేందుకు ఓ సినీ అభిమాని ఈ నలుగురితో ప్రత్యేక వీడియోను తీర్చిదిద్దారు. ఈ అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించి, అందరితోనూ అదరహో అనిపిస్తున్నారు. సదరు వ్యక్తి చేసిన ఆ ప్రయోగం మరేదో కాదు 'విక్రమ్‌ ట్రైలర్‌ ఫీట్‌' . ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సినిమాల్లో 'విక్రమ్‌' ఒకటి.

ఇందులో కమల్‌హాసన్‌ , విజయ్‌ సేతుపతి , ఫహద్ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో, సూర్య గెస్ట్‌ రోల్‌లో కనిపించి, కోలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచిన విషయం తెలిసిందే. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ట్రైలర్‌కు కూడా విశేష స్పందన లభించింది. హీరోలను ఉద్దేశిస్తూ సాగే 'అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్నీ వేటకెళ్తాయ్‌' అనే సంభాషణతో ప్రారంభమయ్యే ప్రచార చిత్రం సినిమాపై భారీ అంచనాలు నమోదు చేసింది.

ఇప్పుడు దానికి స్పూఫ్‌గా వచ్చిన ఈ వీడియో సైతం ఆసక్తి రేకెత్తిస్తోంది. కమల్‌ పాత్రలో మహేశ్‌, విజయ్‌ సేతుపతి పాత్రలో ప్రభాస్‌, ఫహద్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించగా సూర్య పోషించిన రోలెక్స్‌ పాత్రలో అల్లు అర్జున్‌ కనిపించారు. ఆయా హీరోల గత చిత్రాల్లోని సన్నివేశాలు ఈ ట్రైలర్‌లోని సంభాషణలకు సరిగ్గా సరిపోవడంతో 'ఈ నలుగురు నిజంగా కలిసి నటించారా?' అనే సందేహం కలగడం సహజం. 'ఎడిటింగ్‌ అద్భుతం', 'వారెవ్వా','సూపర్‌' అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్న ఈ మల్టీస్టారర్‌ ట్రైలర్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మీరూ ఓ లుక్కేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి పాత్ర కట్.. సుక్కూ ప్లాన్​ అదేనా?

కళ్లు చెదిరే రెమ్యునరేషన్లు.. నయన్​, సామ్ టాప్​​​.. ఆ తర్వాత ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.