ETV Bharat / entertainment

'ఆస్కార్‌' ప్రతిమ నగ్నంగా ఎందుకు ఉంటుందో తెలుసా.. అసలా పేరు ఎలా వచ్చిందంటే?

ఆస్కార్​ అవార్డు..అది ఒక అంతులేని ఆనందం. జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్​ను అందుకోవాలని శతవిధాలుగా పరితపిస్తుంటారు. మార్చి 12న ఆస్కార్​ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అందుకు సంబంధించిన షార్ట్​లిస్ట్​ను మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. అయితే ఆస్కార్​ అవార్డును ఎవరు సృష్టించారు? ఆస్కార్​ను దేంతో తయారు చేస్తారు? ఒక్కో ప్రతిమ తయారీకి ఖర్చు ఎంత? అసలు​ పేరు ఎలా వచ్చింది? తొలిసారి ఆస్కార్​ ఎవరు అందుకున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు మీకోసం..

oscars
oscars
author img

By

Published : Jan 24, 2023, 6:18 AM IST

ఆస్కార్‌... ప్రపంచంలోని ప్రతి సినిమా నటుడు, సాంకేతిక నిపుణుడు అందుకోవాలని చూసే పురస్కారం. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలనుకునే నటులుండరంటే అతిశయోక్తి కాదు. అయితే 95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆస్కార్‌ వేడుకకు ఘన చరిత్ర ఉన్నట్టే.. ఆస్కార్‌ పురస్కార ప్రతిమకూ ఓ చరిత్ర ఉంది. ఈ ఏడాది మార్చి 12న ఆస్కార్​ వేడుక అట్టహాసంగా జరగనుంది. అందుకు సంబంధించి నామినేట్ అయినా వాటిని మరికొద్దిసేపట్లో కాలిఫోర్నియాలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆస్కార్​ అవార్డ్​ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం.

హాలీవుడ్‌ నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన 5 విభాగాలతో 1927లో 'ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ సంస్థ' ఏర్పడింది. అదే 1929 నుంచి చలన చిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి 'అకాడమీ ఆవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌' పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత, వీటిని ఆస్కార్‌ పురస్కారాలుగా పిలవడం మొదలైంది. ఆస్కార్‌ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునేముందు ఆ అవార్డు ఎలా రూపొందిందో చూద్దాం..

ఆస్కార్​ అవార్డును ఎవరు సృష్టించారు?
ఆస్కార్‌ ప్రతిమ.. కాంతులీనే పసిడి వర్ణంతో, ఓ యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్‌ రీలుపై ఠీవీగా నిల్చొన్నట్టు కనిపిస్తుంది. ఈ రూపును ఎంజీఎం స్టూడియో ఆర్ట్‌ డైరెక్టర్‌ కెడ్రిక్‌ గిబ్బన్స్‌ సృష్టించారు.

ఆ ఐదు చువ్వలు దేనికి సూచికలు?
ఆస్కార్‌ ప్రతిమ కింది భాగంలోని రీలు చుట్టులో 5 చువ్వలుంటాయి. అకాడమీలోని 5 విభాగాలకు అవి సూచికలు. ఎమిలో ఫెర్నాండెజ్‌ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తిపొంది.. గిబ్బన్స్‌ ఈ ప్రతిమను రూపొందించాడట. అందుకే ఆస్కార్‌ ప్రతిమ నగ్నంగా కనిపిస్తుంది.

ఆస్కార్​ను దేంతో తయారు చేస్తారు?
ప్రతిమ నమూనా రూపొందాక దానికనుగుణంగా త్రీ డైమెన్షన్స్‌ ప్రతిమను తయారు చేసే పనిని లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ప్రసిద్ధ శిల్పి జార్జ్‌ స్టాన్లీ భుజానికెత్తుకున్నాడు. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ల బంగారు పూత అద్దిన.. 13.5 అంగుళాల ఎత్తు, 8.5 పౌండ్ల (450 గ్రాములపైగా) బరువున్న ఆస్కార్‌ ప్రతిమ స్టాన్లీ చేతుల్లో పురుడు పోసుకుంది.

ఒక్కో ప్రతిమ తయారీకి ఖర్చు ఎంత?
ఈ ప్రతిమ ఆధారంగా షికాగోలోని ఆర్‌.ఎస్‌. ఓవెన్స్‌ అండ్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఏటా ఆస్కార్‌ ప్రతిమలను తయారు చేస్తారు. ఒక్కో ఆస్కార్‌ ప్రతిమ తయారీకి సుమారు 1000 డాలర్లకుపైగా ఖర్చవుతుందని అంచనా. 50 ఆస్కార్‌ ప్రతిమలను రూపొందించేందుకు దాదాపు నెల సమయం పడుతుందట.

ఆస్కార్​ పేరు ఎలా వచ్చింది?
ఈ పురస్కారాలకు ఆస్కార్‌ అని పేరు రావడం వెనక ఓ ప్రచారం ఉంది. తొలిసారి ఈ పురస్కార ప్రతిమను చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మార్గరెట్‌ హెర్రిక్‌.. అందులోని యోధుడు అచ్చం తన అంకుల్‌ ఆస్కార్‌లా ఉన్నాడని అందట. ఆ తర్వాత హాలీవుడ్‌ కాలమిస్ట్‌ సిడ్నీ స్కోల్‌స్కీ తన వ్యాసంలో వీటిని ఆస్కార్‌ పురస్కారాలని ప్రస్తావించాడట. అలా 'ఆస్కార్‌' వాడుకలోకి వచ్చింది.

తొలిసారి ఆస్కార్​ ఎవరు అందుకున్నారు?
మొదటిసారిగా ఆస్కార్‌ అందుకున్న నటుడు ఎమిల్‌ జన్నింగ్స్‌. 'ది లాస్ట్‌ కమాండ్‌' చిత్రానికిగానూ ఆయన ఉత్తమ నటుడిగా ఈ అవార్డు స్వీకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.