ETV Bharat / entertainment

'నాకు ప్రతి సాంగ్​ ఓ ఆడిషనే.. ఆయనే స్ఫూర్తి' - శ్రేయా ఘోషల్ పాటలు

ఎలాంటి పాటనైనా అవలీలగా పాడుతుంది సింగర్​ శ్రేయా ఘోషల్. 16 ఏళ్ల వయసులో కెరీర్ ఆరంభించిన ఈ గాయని.. సినీ పరిశ్రమకు వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న కొన్ని సంగతులు..

shreya ghoshal celebrates 20 years
shreya ghoshal celebrates 20 years
author img

By

Published : Feb 16, 2023, 6:44 AM IST

Updated : Feb 16, 2023, 9:37 AM IST

ఎలాంటి పాటైనా ఆమె గొంతులోంచి రాగానే అమృతంలా ఉంటుంది అంటూ సినీ సంగీత ప్రియులు మురిసిపోతారు. ముఖ్యంగా మెలోడీలు ఆమె పాడితే ఎంతో హాయిగా ఉంటాయంటూ పదేపదే వింటారు. దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఆ మధుర గాయినే శ్రేయా ఘోషల్‌. 'నీ జతగా నేనుండాలి...', 'నువ్వే నా శ్వాస..', 'చలి చలిగా అల్లింది...', 'మాఘ మాస వేళ', 'నువ్వేనా...నా నువ్వేనా...' ఇలా చెప్పుకుంటే పోతే తెలుగులోనూ ఎన్నో సూపర్‌హిట్‌ గీతాలను ఆమె ఆలపించింది. భాషతో సంబంధం లేకుండా ఎన్నో భారతీయ భాషల్లో ఆమె గొంతు ఏదోచోట వింటూనే ఉంటాం. సంజయ్‌ లీలా భన్సాలీ 'దేవదాస్‌' చిత్రంతో పదహారేళ్ల వయస్సులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. చిత్ర పరిశ్రమకు వచ్చి 20ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రేయా ఘోషల్ పంచుకున్న కొన్ని సంగతులు..

'దేవదాస్‌' కోసం రికార్డు చేస్తున్నప్పుడు నాకు 16ఏళ్లు. నా చుట్టూ దిగ్గజ సంగీత దర్శకులు, సంగీత విద్వాంసులు ఉన్నారు. స్టూడియో మొత్తం జనంతో నిండిపోయింది. ఆ దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను సంజయ్‌ భన్సాలీ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌ కోసం పాడాను. ఈ చిత్రంలోని 'భైరి పియా' పాటకు జాతీయ అవార్డును గెలుచుకుంటానని అనుకోలేదు. కొత్తలో నా ప్రతి పాట రికార్డింగ్‌ ఒక ఆడిషన్‌లానే ఉండేది. దేవదాస్‌ సినిమా నన్ను కేరీర్‌లో మరో దశకు ఎదిగేలా చేసింది. దీని తర్వాత నాకు వరస అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే పరిశ్రమలో 20సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినప్పటికీ పెద్దగా ఏమీ మారనట్టుంది. నేను ఇప్పటికీ చిన్న అమ్మాయిలానే భావిస్తున్నాను.

ఆయనే నాకు స్ఫూర్తి..
''సంజయ్‌ లీలా భన్సాలీ ఇప్పటీకీ అదే అభిరుచితో ఉన్నారు. ఆయన జీవితంలో ఖాళీగా ఉన్న క్షణాలు ఉన్నాయని నేను అనుకోను. దర్శకుడిగానే కాదు సంగీతంలోనూ ఆయనకు ఎంతో జ్ఞానం ఉంది. ఇన్ని మాధ్యమాల్లో కళను వ్యక్తీకరించగల వ్యక్తి దొరకడం చాలా అరుదు. తనతో పనిచేసే ఆర్టిస్టులు ఇంకా గొప్ప స్థాయికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. నేను ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆయనను కలిసిన తర్వాత ఎవరైనా జీవితంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని తెలుసుకుంటారు''.

అప్పుడు తిరోగమనమే..!
''నా జీవితంలో నా కుటుంబం ముఖ్యమైనది. సాదాసీదా జీవితాన్ని ఇష్టపడతాను. అహం అనేది అసలు పనికిరాదు. నేను అంతా సాధించేశాను అనుకున్న రోజు జీవితం తిరోగమనం వైపు పయనించడం మొదలుపెడుతుంది. జీవితంలో నీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకు''.

ఈ స్థాయికి కారణం అదే..
''పాటల ద్వారా ఎప్పుడూ గొప్ప భావోద్వేగాలను తీసుకురావాలనుకుంటాను. సంగీతం పట్ల నాకున్న ప్రేమే ఉన్నత స్థాయిలో నిలిచేలా చేసిందని భావిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా పియానో పట్టుకుని ఉంటాను. నా ప్రతి పనిలో సంగీతం పట్ల ఇష్టం కనపడుతూనే ఉంటుంది. అందుకేనేమో ప్రజలు నన్ను ఇంతలా అభిమానుస్తున్నారు.''

Last Updated : Feb 16, 2023, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.