SIIMA Awards 2023 nominations : సౌత్ సినీ ఇండస్ట్రీలో అవార్డుల పండగకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) 2023 అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఈ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.
తాజాగా నామినేషన్లను మొదలు పెట్టారు ఈవెంట్ నిర్వాహకులు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి ఈ సైమా పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఇటీవలే బెస్ట్ మూవీ నామినేషన్ లిస్ట్‌ను ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో బెస్ట్ డైరెక్టర్ల నామినేటెడ్ జాబితాను విడుదల చేశారు.
SIIMA Awards 2023 nominations list telugu : ఈ జాబితాలో 'కార్తికేయ 2' సినిమాకుగానూ చందు మొండేటి, సీతారామం చిత్రానికిగాను హను రాఘవపూడి, ఆర్ఆర్ఆర్ సినిమాకుగానూ దర్శకధీరుడు రాజమౌళి, మేజర్ సినిమాకు గాను శశి కిరణ్ తిక్క, డీజే టిల్లు చిత్రానికిగాను విమల్‌లను నామినేట్ చేసినట్టు అనౌన్స్ చేసింది. తెలుగులో బెస్ట్ మూవీస్ విభాగంలో 'ఆర్ఆర్ఆర్', సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు', నిఖిల్ సిద్దార్థ్ 'కార్తికేయ 2', అడవి శేష్ 'మేజర్', దుల్కర్ సల్మాన్ 'సీతారామం' చిత్రాలను నామినేట్ చేశారు. ఇప్పుడా సినిమా దర్శకులనే బెస్ట్ డైరెక్టర్ అవార్డుకు నామినేట్ చేయడం విశేషం.
-
SIIMA 2023 Best Director | Telugu
— SIIMA (@siima) August 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
1: @chandoomondeti for #Karthikeya2
2: @hanurpudi for #SitaRamam
3: @ssrajamouli for #RRR
4: @SashiTikka for #Major
5: @K13Vimal for #DJTillu
Vote for your Favorite at https://t.co/zG3wPGpQCf#NEXASIIMA #DanubeProperties #A23Rummy… pic.twitter.com/z0GScRFzQy
">SIIMA 2023 Best Director | Telugu
— SIIMA (@siima) August 3, 2023
1: @chandoomondeti for #Karthikeya2
2: @hanurpudi for #SitaRamam
3: @ssrajamouli for #RRR
4: @SashiTikka for #Major
5: @K13Vimal for #DJTillu
Vote for your Favorite at https://t.co/zG3wPGpQCf#NEXASIIMA #DanubeProperties #A23Rummy… pic.twitter.com/z0GScRFzQySIIMA 2023 Best Director | Telugu
— SIIMA (@siima) August 3, 2023
1: @chandoomondeti for #Karthikeya2
2: @hanurpudi for #SitaRamam
3: @ssrajamouli for #RRR
4: @SashiTikka for #Major
5: @K13Vimal for #DJTillu
Vote for your Favorite at https://t.co/zG3wPGpQCf#NEXASIIMA #DanubeProperties #A23Rummy… pic.twitter.com/z0GScRFzQy
తమిళలంలో గార్గి సినిమాకు గౌత్తమ్ రామచంద్రన్, విక్రమ్ చిత్రానికి లోకేశ్ కనగరాజ్, పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం, తిరుచిత్రాంబలం సినిమాకు మిత్రన్ ఆర్ జవహర్, కడైసి వివసాయి చిత్రానికి మణికందన్ నామినేట్ అయ్యారు. కన్నడలో కేజీయఫ్ 2 ప్రశాంత్ నీల్, కాంతార రిషభ్ శెట్టి, విక్రాంత్ రోణ అనూప్ భండారి, లవ్ మాక్‌టెయిల్ డార్లింగ్ కృష్ణ, 777 చార్లీ కిరణ్ రాజ్ నామినేట్ అయ్యారు. ఇక మలయాళంలో దర్శకులు అమల్ నీరద్, ఖలీద్ రహ్మాణ్, తరుణ్ మూర్తి, వినీత్ శ్రీనివాసన్, మహేశ్ నారాయణన్ నామినేటెడ్ లిస్ట్‌లో ఉన్నారు.
ఇదీ చూడండి :
Rajamouli Mahesh babu movie : ఆ రోజు సర్ప్రైజ్ ఇవ్వనున్న రాజమౌళి!
pushpa 2 release date : 'పుష్ప 2' మరింత ఆలస్యం.. సుక్కు మరో జక్కన్న అవుతాడా?