ETV Bharat / entertainment

పాపులర్​ సెలబ్రిటీగా రష్మిక.. బన్నీని వెనక్కి నెట్టి టాప్​-3లోకి! - రష్మిక పుష్ప 2

నేషనల్ క్రష్ రష్మిక అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ మూవీ రేటింగ్ పోర్టల్ ఐఎండీబీ ప్రకటించిన పాపులర్ ఇండియన్ సెలబ్రెటీ జాబితాలో ఈ ముద్దుగుమ్మ చోటు దక్కించుకుంది.

rashmika
rashmika
author img

By

Published : Apr 15, 2023, 6:29 PM IST

టాలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో.. ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం తర్వాత నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. కన్నడ చిత్రాలతో చిత్రసీమలో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళంతో పాటు ప్రస్తుతం హిందీలో పాపులర్ హీరోయిన్‍‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. తన అందానికి, అభినయానికి సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ ప్రకటించిన పాపులర్ ఇండియన్ సెలబ్రెటీ జాబితాలో చోటు దక్కించుకుంది.

ఐఎండీబీ ప్రకటించిన క్లౌడ్ నైన్ జాబితాలో రష్మిక మూడో స్థానంలో నిలిచింది. ఈ నెల ప్రారంభంలో తన పుట్టిన రోజు రావడం, పుష్ప-2 టీజర్ విడుదల కావడం తదితర కారణాల వల్ల ఇంటర్నెట్​లో ఎక్కువ మంది మాట్లాడుకునే సెలబ్రెటీల్లో ఒకరిగా రష్మిక నిలిచింది. దీంతో మోస్ట్ పాపులర్ సెలబ్రెటీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఐఎండీబీ తన ట్విటర్ వేదికగా పోస్టు ద్వారా తెలియజేసింది.

"గత వారం అభిమానులను రష్మిక బర్త్‌డే జరపడం, పుష్ప2 టీజర్ రిలీజ్​ కావడంతో ఆమె ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రటీస్ ఫీచర్‌లో మూడో స్థానంలో నిలిచింది" అని ఐఎండీబీ ట్వీట్ చేసింది. నేషనల్ క్రష్ ఈ అరుదైన ఘనత సాధించడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్విట్టర్​ వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన ఫొటోలు షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

అయితే ఐఎండీబీ కొత్త జాబితాలో 11వ స్థానంలో తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ ఉన్నారు. పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్‌ 17వ స్థానంలో నిలవడం గమనార్హం. ఆ తర్వాత మృణాల్‌ ఠాకూర్‌ (31) తమన్నా (33) కరీనా (34), నాని (49), కీర్తి సురేశ్‌ (50)లు ఉన్నారు.

సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రష్మిక.. పుష్ప-2 చిత్రంతో ఫుల్ బిజీగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదికాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌తో ఓ మూవీకి పచ్చ జెండా ఊపింది. దీంతో పాటు తెలుగు, తమిళంలో రెయిన్ బో అనే ఓ ద్విభాషా చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా చేస్తోంది. దీనికి శాంతారుబన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్‌లోనూ నటించింది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.