ETV Bharat / entertainment

RRR movie: రాజమౌళికి ప్రతిష్ఠాత్మక అవార్డు.. ఆస్కార్​ ఆశలు సజీవం

ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో ఘనత దక్కింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి గానూ రాజమౌళి ఓ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు.

RRR Rajamouli  award
RRR movie: రాజమౌళికి ప్రతిష్ఠాత్మక అవార్డు
author img

By

Published : Dec 3, 2022, 11:22 AM IST

Updated : Dec 3, 2022, 12:38 PM IST

ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో ఘనత దక్కింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్ అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. దీంతో జక్కన్నకు అభినందనలు చెబుతూ సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు. వార్తా పత్రికలు, మ్యాగజైన్స్‌, ఆన్‌లైన్‌ పబ్లికేషన్స్‌కు సంబంధించిన పలువురు ప్రముఖులు ఒక బృందంగా ఏర్పడి 1935 నుంచి సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేస్తున్నారు.

రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి సుమారు రూ.1200 కోట్లు వసూళ్లు రాబట్టిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్‌చరణ్‌ - తారక్‌ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా అలరించిన ఈ సినిమా ఇప్పటికే శాటర్న్‌, సన్‌సెట్‌ సర్కిల్‌ వంటి పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. మరోవైపు ఈ సినిమా 'ఆస్కార్‌' బరిలోకి దిగిన విషయం తెలిసిందే. దాదాపు 14 విభాగాల్లో ఇది ఆస్కార్‌ వేదికగా పోటీ పడనుంది.

ఆర్​ఆర్​ఆర్ ఆస్కార్ ఆశలు​: ప్రతిష్టాత్మకంగా తెరెకక్కిన ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలుస్తుందని అంతా ఆశించారు. కానీ అది కుదరలేదు. అయినా ఈ చిత్రాన్ని ఆస్కార్ రేసులో నిలపాలని చిత్రబృందం పరోక్షంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఇప్పుడీ చిత్ర ప్రేమికులకు ఓ శుభవార్త అందింది. అదేంటంటే.. తాజాగా జరిగిన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌ అవార్డు నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవంలో జక్కన్నకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కించుకున్నారు. అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు బెస్ట్​ డైరెక్టర్ విన్నర్స్​గా నిలిచిన వారిలో 16 మంది ఆస్కార్​కు నామినేట్​ అయ్యారు. దీంతో నెటిజన్లంతా రాజమౌళికి ఈ సారి ఆస్కార్ అవార్డు వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: మెహందీ వేడుకలో భర్తతో కలిసి చిందులేసిన హన్సిక ఎంత అందంగా ఉందో

Last Updated : Dec 3, 2022, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.