ETV Bharat / entertainment

రూ.400 కోట్లతో పవన్ 'OG'?.. ఒక్కొక్కరూ చెప్పేది వింటుంటే గూస్ బంప్సే! - పవన్​ కల్యాణ్​ ఓజీ మూవీ బడ్జెట్​

Pawan Kalyan OG : పవన్​ కల్యాణ్ సుజీత్​ కాంబోలో తెరకెక్కుతున్న 'ఓజీ' మూవీ ప్రస్తుతం అభిమానుల్లో భారీ అంచనాలే పెంచుతోంది. ఇప్పటికే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్​ లాంటి స్టార్స్ ఈ సినిమా గురించి తాజా అప్డేట్స్​ అందించగా.. ఇప్పుడు మరో స్టార్​ ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. అదేంటంటే ?

pawan-kalyan sujeeth-og-movie-budget
pawan-kalyan sujeeth-og-movie-budget
author img

By

Published : Jun 24, 2023, 2:36 PM IST

Pawan Kalyan OG Budget : ప్రస్తుతం ఎక్కడ చూసిన పాన్ ఇండియా మేనియా నడుస్తోంది. ఏ దర్శకుడిని కదిపినా ఇటువంటి కంటెంట్​ దర్శనమిస్తోంది. దర్శక నిర్మాతలే కాదు హీరో హీరోయిన్లు కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలంటేనే భారీ బడ్జెట్​తో రూపొందాల్సిందే. ఎందుకంటే అన్ని భాషల్లో తెరకెక్కాలంటే దానికి తగ్గట్టుగా అన్నింటిని సమకూర్చుకోవాల్సిందే. తారల రెమ్యునరేషన్​ నుంచి సెట్లు వేయడం వరకు అన్నీ కూడా వ్యయంతో కూడిన పనే. అందులోనూ గ్యాంగ్‌స్టర్ డ్రామా, యాక్షన్ సినిమాలు అంటే వందల కోట్ల రూపాయలు అవసరమవుతుంటాయి. తాజాగా రిలీజ్​కు సిద్ధమౌతున్న పవర్ స్టార్ పవన్ -సుజీత్ మూవీ ఈ కోవకు చెందిందే.

'ఓజీ' అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఎక్కడ చూసిన చర్చలు జరుగుతోంది. పవన్​కు సంబంధించిన షూటింగ్​ ఫొటోలుతో పాటు, మోషన్​ పోస్టర్​, స్పెషల్​ వీడియో ఇలా ఓజీకి సంబంధించిన ఏ అప్డేట్​ వచ్చిన అది సోషల్​ మీడియాలో ట్రెండ్​ అయ్యి చరిత్రలు సృష్టిస్తోంది. మరోవైపు ఓజీలోని ఇతర తారాగణం పలు మీడియాలకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో మూవీ ఎలా ఉండనుందో అన్న విషయాలను టూకీగా చెప్పుకొస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్​ దాస్​ లాంటి స్టార్స్.. ఓజీ గురించి​ చెప్పిన మాటలతో ఈ సినిమా గురించి అభిమానుల్లో భారీ అంచనాలే పెరిగిపోయాయి.

ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ స్టార్​ కమల్​ కూడా ఓజీగా గురించి వ్యాఖ్యానించారు. ఇటీవలే ఓ ఛానల్​కు ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆయన.. సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ముంబయిలో జరిగిన చిత్రీకరణలో పాల్గొన్నానని తెలిపిన కమల్​.. ఈ సినిమాలో పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ గెటప్ అద్భుతమంటూ కొనియాడారు. ఇక, నిర్మాణ విషయంలో డీవీవీ దానయ్య అసలు రాజీ పడటం లేదని వ్యాఖ్యానించారు. సినిమా బడ్జెట్​ ఎంత? అని యాంకర్​ ప్రశ్నించగా... 'పూర్తి వివరాలు నాకు తెలియవు. కానీ, సుమారు రూ.400-500 కోట్లు ఉంటుంది' అని కమల్ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Pawan Kalyan OG Cast : ఓజీ సినిమా విషయానికి వస్తే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పార్వతి సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'సాహో' ఫేమ్ సుజిత్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్​ దశలో ఉంది. ముంబయి, హైదరాబాద్​ లాంటి లొకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. 'ఓజీ'లో పవన్ కళ్యాణ్ జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. ఇందులో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు​. ఇక డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.