Pawan Kalyan OG Glimpse : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఓజీ'. శనివారం పవన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ గ్లింప్స్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇక దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అందులో ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లో కనిపించిన పవన్.. తన స్టైలిష్ లుక్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను గూస్బంప్స్ తెప్పించారు. అసలు ఊహించని రీతిలో ఉన్న ఆ టీజర్ ఇప్పుడు మిలియన్లకు పైగా వ్యూవ్స్‌తో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇక పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోను లూప్‌లో పెట్టుకుని మరీ చూస్తున్నారట.
గత కొన్నేళ్లుగా పవన్ నటిస్తున్న సినిమాలు ఆయన స్టామినాతో సరిపోలడం లేదంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ టీజర్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది. 'తమ్ముడు', 'ఖుషి' 'బద్రి' లాంటి సినిమాల్లో లాగా ఈ ఓజీ కూడా పవన్‌లోని పవర్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చిందంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇండస్ట్రీకి సాలిడ్ హిట్స్ తెచ్చిపెట్టిన ఆ సినిమాల తర్వాత తర్వాత దర్శకులు ఎవరూ పవన్ ఇమేజ్‌కి సరిపోయే చిత్రాన్ని తీయలేకపోయారు.
OG Teaser Details : 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' తప్ప పవన్ ఇమేజ్‌ని మరే సినిమా బ్యాలెన్స్ చేయలేదనేది వాస్తవం. ఇక పవన్ కూడా 'అజ్ఞాతవాసి' తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే కమ్‌బ్యాక్‌లో పవన్.. బ్యాక్ టు బ్యాక్ రీమేక్‌లు చేయడం పట్ల ఆయన అభిమానులను ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఓజీ రాకతో ఊరట చెందిన ఫ్యాన్స్.. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందో అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ టీజర్‌ను డీకోడ్ చేస్తే అందులోని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే..
- 'ఓజీ' కంటే ముందు సుజిత్ దర్శకత్వం వహించిన సినిమా 'సాహో'. 'వాజీ' అనే ఓ కల్పిత పట్టణంలో ఆ కథ జరిగినట్లు చూపించారు. అయితే ఇప్పుడు ఓజీలో వీడియోలో 'వాజీ ఇంపోర్ట్స్ & ఎక్స్పోర్ట్స్' అనే ఓ బోర్డు చూపించారు. దాని ముందు ఫైట్ జరిగినట్లు హింట్ ఇచ్చారు. దీంతో ఆ వాజీ సిటీకి, ముంబైలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు సంబంధం ఉంటూ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అంటే ఇది సుజిత్ కూడా 'ఓజీ'తో సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నారంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.
- ఇక టీజర్ చివరిలో పవన్ మరాఠీలో మాట్లాడతారు. అందులో 'లావ్కర్' అంటే... 'త్వరగా' అని అర్థం. ' ఖడే ఖడే కాయి బాగ్తోస్ జాకర్ దూండ్. అంటే... నిలబడి ఏం చూస్తున్నావ్ ! వెళ్లి త్వరగా వెతుకు' అని అర్థమట. అంతే కాకుండా పవన్ బ్రాస్‌లెట్‌పై ఉన్న జపనీస్ పదాలకు ' డ్రాగన్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు' అని అర్థమట.
- సాధారణంగా పవన్ సినిమాల్లో సోషల్ మెసేజ్ ఇచ్చే పాట ఒకటి కచ్చితంగా ఉంటుంది. అయితే 'ఓజీ'లో కూడా అలాంటి పాట ఉండొచ్చు అంటూ ఓ హింట్ ఇచ్చారు. ఇందులో కొంత మంది రోడ్ల మీద ఆందోళన చేసే దృశ్యాలు, వాళ్ళను పోలీసులు కొట్టడం వంటివి ఉన్నాయి. దీన్ని చూస్తుంటే ఆ సాంగ్ అప్పుడే రానున్నట్లు అనిపిస్తోంది.
OG Glimpse : చిరుతలా వేటాడుతూ పవన్ ఊచకోత.. 'ఓజీ' హంగ్రీ చీతా గ్లింప్స్ గూస్‌బంప్సే
OG Glimpse : OG గ్లింప్స్ డీటైల్స్ లీక్.. తెలుగులోనే తొలిసారి అలా.. ఇది తెలిస్తే గూస్‌బంప్సే!