ETV Bharat / entertainment

ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌-కె' స్పెషల్ వీడియో రిలీజ్​.. విలన్స్ వీళ్లేనా?

author img

By

Published : Apr 10, 2023, 2:27 PM IST

Updated : Apr 10, 2023, 3:10 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ నటిస్తున్న 'ప్రాజెక్ట్​ కె' నుంచి ఎపిసోడ్​ 2 అంటూ ఓ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోను మీరు చూసేయండి..

Pan india star Prabhas Project K Episode 2 video released
ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌-కె' స్పెషల్ వీడియో రిలీజ్​.. విలన్స్ వీళ్లేనా?

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్‌ కె'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్‌ 'ఫ్రమ్​ స్క్రాచ్'​ అంటూ ఎపిసోడ్​ 2 పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. రైడర్స్​ మేకింగ్ వీడియో అది. ఇందులో రైడర్స్‌కు కాస్ట్యూమ్స్ ఎలా తీర్చిదిద్దారో వివరించారు.

ఇక ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ డిస్కషన్ జరుగుతూ కనిపించింది. ఆ రైడర్స్ గురించి మూవీటీమ్​లో మెంబర్స్​ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. దీంతో ఈ వీడియో చూసిన అభిమానులు రైడ్ఫర్స్ విలన్స్ అయి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ప్రభాస్ తరఫున ఉండే సైన్యం అని కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ సినిమాలో ఈ రైడర్స్ అనే వాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. మరి 'ప్రాజెక్ట్‌ కె'లో ఈ రైడర్స్‌ పాత్రేంటి? వారు ఏం చేస్తారు? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్​ అయ్యే వరకూ వేచి ఉండాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మ్యూజిక్​ డైరెక్టర్​ ఛేంజ్​..
అయితే ఈ చిత్రంలో ఇటీవలే కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సినిమా మొదట ప్రకటించినప్పుడు మ్యూజిక్​ డైరెక్టర్​గా మిక్కీ జె మేయర్‌ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో సంతోష్‌ నారాయణన్​ను తీసుకోవాల్సి వచ్చింది . ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ తెలిపారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

"ప్రాజెక్ట్‌-కె సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌ మూవీ అయినప్పటికీ ఎమోషన్స్‌, సెంటిమెంట్స్​ కూడా ఉంటాయి. ఇప్పటివరకూ ఈ మూవీ షూటింగ్​ 70 శాతం పూర్తైంది. ప్రభాస్‌తో పాటు, దీపిక, అమితాబ్‌లకు కూడా స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఎక్కువగా ఉంది. చాలా సన్నివేశాల్లో ఈ ముగ్గురూ కలిసి కనిపిస్తారు. ఆడియెన్స్​ ఇప్పటివరకు చెందని సరికొత్త అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది. ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ ఓ ఐదారు కంపెనీలు చేస్తున్నాయి. వాటిని తెరపై చూసినప్పుడు న భూతో నభవిష్యతి అన్నట్లు ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు.

వరుసగా తమిళ చిత్రాలకు పని చేస్తున్న సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ పేరు తెరపైకి రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఆయన ఇప్పటివరకు అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్​ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆడియెన్స్​కు గూస్​ బంప్స్​ తెప్పిస్తుంది. ప్రస్తుతం ఆయన తెలుగులో నాని 'దసరా', వెంకటేశ్‌ 'సైంధవ్‌'కు మ్యూజిక్​ను అందించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న 'ప్రాజెక్ట్‌ కె' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఇటీవల సోషల్​మీడియా ద్వారా తెలిపింది.

Last Updated : Apr 10, 2023, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.