ETV Bharat / entertainment

వామ్మో.. ఆస్కార్ కోసం రూ. 463,92,47,300 ఖర్చు చేశారా..?

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్​ ప్రదానోత్సవ వేడుక ముగిసింది. మొత్తం 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. మరి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్​ను నిర్వహించేందుకు రూ. 463,92,47,300 ఖర్చు చేశారట. ఆ వివరాలు..

Oscar 2023 award event expenditure details
వామ్మో.. ఆస్కార్ కోసం రూ. 463,92,47,300 ఖర్చు చేశారా?
author img

By

Published : Mar 13, 2023, 2:18 PM IST

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్​ ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. వరల్డ్​ వైడ్​గా సినీ సెలబ్రిటీలతో పాటు నామినేషన్స్​ కేటగిరిలో ఉన్న నటీనటులు, మిగతా టెక్నిషియన్స్​ ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. భిన్న డ్రెస్సుల్లో కనిపించి కనువిందు చేశారు. ముఖ్యంగా భారతీయ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. వారందరూ కోరుకున్నట్టే ఆర్​ఆర్​ఆర్​ చిత్రానికి ఆస్కార్ వరించింది. బెస్ట్ ఒరిజినల్​ సాంగ్ విభాగంలో నామినేట్​ అయిన నాటు నాటు సాంగ్​ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ అవార్డ్​ అందుకున్న తొలి భారతీయ, తెలుగు గీతంగా చరిత్ర సృష్టించింది. సాంగ్ లిరిసిస్ట్​ చంద్రబోస్​, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఆస్కార్​ వేదికపై అవార్డును అందుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

అయితే ఈ సారి ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ వేడుకల్లో కొన్ని కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గెస్ట్​లకు రెడ్‌ కార్పెట్‌ మీద కాకుండా షాంపైన్ మీద ఆహ్వానం పలికారు. అంటే ఎర్ర రంగు కార్పెట్​ను షాంపైన్​ కలర్​లోకి మార్చారు. ఆస్కార్‌ చరిత్రలోనే ఇలా మార్చడం తొలిసారి. దాదాపు 50 వేల స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర. రూ. 24,700 డాలర్స్ ఉంటుందని తెలిసింది. దీన్ని ఏర్పాటు చేయడానికి 600 గంటలు సమయం పట్టిందని తెలిసింది.

ఇక ఈ ఆస్కార్‌ ప్రదానోత్సవ కార్యక్రమం కోసం 56.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారట. అంటే భారత కరెన్సీలో రూ. 463,92,47,300 రూపాయలు. ఈ కార్పెట్​పై నడవడం కోసం ఒక్క నటి వేసుకునే డ్రెస్ ఖరీదు కనీసం 10 మిలియన్ డాలర్స్ ఉంటుందని తెలిసింది. ఇంకా ఈ ఈవెంట్‌లో ఏదైనా అడ్వటైజ్​మెంట్​ వేయాలంటే 30 సెకన్ల కోసం 2 మిలియన్స్‌ డాలర్స్‌ చెల్లించాలట.

కాగా, మొత్తం 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేసిన ఈ కార్యక్రమంలో.. ఈ సారి భారత్​కు మూడు విభాగాల్లో (బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్, బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్​) నామినేషన్స్‌ దక్కగా.. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్​ విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. బెస్ట్ ఒరిజినల్​ సాంగ్​లో నాటు నాటు పాటకు, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్​​లో ది ఎలిఫెంట్ విస్పరర్స్​కు లభించాయి. మొత్తంగా ఈ 95వ వేడుకలు లాస్ ఏంజిల్స్​లోని డాల్బీ థియేటర్​ గ్రాండ్​గా జరిగాయి. 'ఎవ్రీథింగ్​ ఎవ్రీవేర్​ ఆల్​ ఎట్​ వన్స్'​ చిత్రం ఏకంగా ఏడు పరస్కారాలను దక్కించుకుంది.

ఇదీ చూడండి: ఆస్కార్ విజేతలు వీరే.. ఆ చిత్రానికి ఏకంగా ఏడు అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.