ETV Bharat / entertainment

'కార్తికేయ 2' రిలీజ్​ చేయొద్దని హెచ్చరించారు: నిఖిల్​ - నిఖిల్ కార్తికేయ 2 మూవీ అప్డేట్స్​

Nikhil Karthikeya 2: 'కార్తికేయ 2'వాయిదా పడటానికి గల కారణాన్ని తెలిపారు హీరో నిఖిల్​. ఈ సినిమా విడుదల విషయంలో తనను కొంతమంది బెదిరించారని పేర్కొన్నారు.

karhtikeya 2 nikhil
కార్తికేయ 2 నిఖిల్​
author img

By

Published : Aug 1, 2022, 3:17 PM IST

Nikhil Karthikeya 2: హీరో నిఖిల్ షాకింగ్​ కామెంట్స్​ చేశారు. తనకు సినీ బ్యాక్​గ్రౌండ్​ లేకపోవడం వల్ల తన సినిమా రిలీజ్​ డేట్​ను మార్చేస్తున్నారని ఆరోపించారు. సినిమా ప్రమోషన్స్​లో భాగాంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

"ఆగ‌స్టు 12న రావాల‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత ఆ రోజు కూడా సినిమాను రిలీజ్ చేయ‌వ‌ద్దంటూ కొంద‌రు చెప్పారు. 'ఇప్ప‌ట్లో మీ సినిమా రిలీజ్ చేయ‌ద్దు...అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ కు వెళ్లిపోండి' అని అన్నారు. 'కార్తికేయ 2'కి థియేట‌ర్స్ దొరకవని అన్నారు. నా తొలి సినిమా హ్యాపీడేస్ నుంచి ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేద‌ు. సినిమా రిలీజ్ కాద‌నే ఆలోచ‌న రాగానే భరించలేకపోయ" అని నిఖిల్​ అన్నారు.

కాగా, మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు చందూ ముండేటి దర్శకత్వం వహించారు. 2017లోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కానీ కరోనా కారణంగా 2022 ఆగస్టు 12న విడుదల అవుతోంది. తొలుత ఈ మూవీ జులై 22న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజు నాగచైతన్య థ్యాంక్యూ విడుదల కావడం వల్ల ఆగస్టుకు వాయిదా వేశారు. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్​ హీరోయిన్​. . బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: 'బింబిసార', 'సీతారామం' ఈ వారమే.. ఇంకా ఏ చిత్రాలు వస్తున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.